ఇది బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: ఆర్ఎస్ ప్రవీణ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇది బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: ఆర్ఎస్ ప్రవీణ్

March 16, 2022

bfbfdb

తెలంగాణ ప్రభుత్వంపై బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ రాష్ట్ర క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విటర్ వేదికగా తెలంగాణ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘బంగారు తెలంగాణ చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని బాకీల తెలంగాణ‌గా చేశారు’ అంటూ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆరోపించారు. బ‌హుజ‌న యాత్ర పేరిట ఆయన తెలంగాణ‌లో పాద‌యాత్ర మొద‌లుపెట్టిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ”బంగారు తెలంగాణ అంటూ బాకీల తెలంగాణ చేసిండ్రు. బహుజన రాజ్యంలో ప్రతి పైసా లెక్క ప్రజలకు చూపిస్తాం. ఇప్పుడు దోచిన నాయకుల లెక్క తేలుస్తాం. ముక్కు పిండి ఆ డబ్బులు వసూలు చేసి గొప్ప పాఠశాలలు, వైద్యశాలలు నిర్మిస్తాం.” అని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా అప్పులు పెంచుకుంటూ పోవడాన్ని కాగ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుల భారం అంతకంతకు పెరిగిపోతుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు.. ఎఫ్ఆర్‌‌బీఎం చట్ట పరిమితిలోనే ఉన్నప్పట్టికీ బడ్జెట్‌కు సంబంధం లేకుండా తీసుకున్న బడ్జెటేతర అప్పులతో పరిమితి దాటిపోయిందని అభిప్రాయపడింది.