ఇదే మా ఇన్విటేషన్ కార్డ్: నయనతార - MicTv.in - Telugu News
mictv telugu

ఇదే మా ఇన్విటేషన్ కార్డ్: నయనతార

May 29, 2022

కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్ళి పత్రికకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. మొత్తం డిజిటల్ ఫార్మేట్‌లో ఆహ్వాన పత్రికను డిజైన్ చేశారు. ఆ పెళ్లి కార్డ్‌లో నయన్ అండ్ విక్కీ అని సింపుల్‌గా పేర్లు కొట్టించారు. మోషన్ పోస్టర్ స్టైల్లో ఆ శుభలేఖను తయారు చేయించారు. ఇదే మా ఇన్విటేషన్ కార్డ్ అనే ట్యాగ్‌తో నయనతార అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

ఇక, నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మొదటగా వీరి పెళ్లి తిరుమలలో వచ్చే నెలలో జరగనుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ, తాజాగా పెళ్లి వేదిక మారినట్లు శుభలేఖ వల్ల తెలుస్తోంది. చెన్నైకి దగ్గరలో ఉన్న మహాబలిపురంలో వీరి పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వివాహానికి సంబంధించి నయన్-విఘ్నేశ్ ఇప్పటికే తమ స్నేహితులదరికీ..ఇదే మా ఇన్విటేషన్ కార్డ్ అంటూ ఓ వీడియో ద్వారా ఇన్విటేషన్ పంపించారు. ఇన్విటేషన్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. జూన్ తొమ్మిదిన మహాబలిపురంలోని మహబ్ హోటల్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఆ తర్వాత ఇండస్ట్రీ మిత్రుల కోసం చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ జరిగే అవకాశమున్నట్లు తమిళ సినీ వర్గాలు తెలిపాయి.

మరోపక్క నయన్-విఫ్నేశ్‌ల పెళ్లికి విజయ్ సేతుపతి, సమంత, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార తమిళంలో ‘ఓ2’, అజిత్ 62వ చిత్రంలో, మలయాళంలో పృధ్విరాజ్ హీరోగా ‘గోల్డ్’ అనే మూవీలో, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చిత్రాలలో నయనతార నటిస్తోంది.