ఆంధ్రప్రదేశ్లో వరుస ఐటీ సోదాలు కొనసాగతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. సీఎం రమేష్ ప్రస్తుతం న్యూఢిల్లీలో వున్నారు. హైదరాబాద్, కడపలో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఈ దాడులు జరుగుతున్నాయి. సుమారు 60 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన సోదరుడి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి.కేంద్రం చేస్తున్న అన్యాయాలను, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రశ్నిస్తున్నందునే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసి భయపెడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖకు తాను పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నానని, తన కంపెనీలు పూర్తి పారదర్శక లావాదేవీలను నడుపుతాయని సీఎం రమేష్ చెప్పారు.
బీజేపీ చర్య ఇది…
ఐటీ దాడులపై తాను సమాచారం అడిగిన మూడు రోజుల్లోనే తన ఇంటిపై దాడులకు వచ్చారని సీఎం రమేష్ అన్నారు. తాను న్యూఢిల్లీలో ఉన్న సమయంలో కడప, హైదరాబాద్లోని ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకుందని తెలిపారు.