మహిళలు పెరుగుతున్న ఖర్చులు చూసి ఇంటికి ఆసరాగా నిలవాలని ప్లాన్ చేస్తున్నారా ప్రతి నెల వస్తున్న ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదు ఖర్చులన్నీ పెరిగిపోయాయి ఆదాయం మాత్రం పెరగడం లేదు ఇలాంటి సమయంలో ఏం చేయాలి మీ సమయాన్ని వినియోగించుకుని ప్రతి నెల ఆదాయం పొందే మార్గం గురించి తెలుసుకుందాం.
ఫుడ్ బిజినెస్ ఉన్న డిమాండ్ మరే ఇతర బిజినెస్ కు ఉండదు. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ ద్వారా చాలా ఎక్కువ ఆదాయం పొందే వీలుంది అయితే సరైన మార్కెటింగ్ కస్టమర్ నుంచి ఆదరణ లభించినట్లయితే మీరు ప్రతి నెల ఇంట్లో ఉండి లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.
జొమాటో స్విగ్గి లాంటి యాప్స్ ద్వారా ఫుడ్ డెలివరీ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు కనిపిస్తున్నాయి ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇంతకీ అసలు క్లౌడ్ కిచెన్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
క్లౌడ్ కిచెన్ అంటే రెస్టారెంట్ లేకుండా కేవలం ఒక కిచెన్ ఏర్పాటు చేసుకొని ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు పొంది ఫుడ్ డెలివరీ చేయడం ద్వారా, ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ను ప్రస్తుతం అన్ని నగరాల్లోనూ వ్యాపించింది.
ముందుగా మీరు క్లౌడ్ కిచెన్ స్థాపించాలి అనుకుంటే మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ఒక కమర్షియల్ రెస్టారెంట్ స్టైల్ కిచెన్ ను ఏర్పాటు చేసుకోవాలి. మీరు చేయగలిగే మెనూ తయారు చేసుకోవాలి. అనంతరం స్థానిక మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ లు, ఫుడ్ లైసెన్స్ పొందాలి. అనంతరం జొమాటో, స్విగ్గీ, లేదా మీరు స్వంతంగా ఫుడ్ డెలివరీ చేసేలా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే చక్కగా ఆర్డర్ లు వస్తాయి.
మీరు ఏర్పాటు చేసుకున్న తర్వాత పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యమైనది. పబ్లిసిటీ లేకుండా డా మీ బ్రాండ్ జనాల్లోకి వెళ్లడం చాలా కష్టం. పబ్లిసిటీ కోసం మీరు వీలైతే డిజిటల్ మార్కెటింగ్ నిపుణులను సంప్రదించాలి. మీరు ఏర్పాటు చేసుకున్న బ్రాండ్ ఎంత త్వరగా ప్రజల్లోకి వెళితే అన్ని ఆర్డర్లను మీరు పొందవచ్చు.
క్లౌడ్ కిచెన్ ద్వారా మీరు ఉన్న చోట నుంచి చక్కటి ఆదాయం పొందే వీలుంది. మీరు ఏర్పాటు చేసుకున్న మెనూను బట్టి మంచి క్వాలిటీ, టేస్ట్ మెయింటెయిన్ చేస్తే పెద్ద మొత్తంలో ఆర్డర్లను పొందవచ్చు. తద్వారా మీరు మంచి ఆదాయం దక్కించుకునే అవకాశం ఉంది.