ఎస్‌ఐ, కానిస్టేబుల్ సిలబస్ ఇదే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్‌ఐ, కానిస్టేబుల్ సిలబస్ ఇదే..

April 26, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పోలీస్ అవ్వాలి అని కళలు కంటున్న అభ్యర్థుల కళలను నేరవేర్చటానికి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని పూర్తి సిలబస్‌ను విడుదల చేసింది. సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

1. ఎస్‌ఐ (ఐటీ, పీటీవో, ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టులకు రాత పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. అందులో ఒక్కొక్క పేపర్లో ఎన్ని మార్కులు ఉంటాయి? ఏఏ అంశాలు చదవాలి? అంటే.. పేపర్-1, 2 పరీక్షలు (ఐటీ, పీటీవో, ఫింగర్ ప్రింట్ బ్యూరో) విభాగాలకు ఒకే విధమైన సిలబస్ ఉంటుంది.

పేపర్-1లో..
ఇంగ్లీష్ సబ్జెక్టుపై 100 మార్కులు ఆబ్జెక్టివ్ (50 ప్రశ్నలు, 25 మార్కులు), డిస్క్రిప్టివ్ టైప్ (75 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి. పదోవ తరగతి స్థాయి సిలబస్‌పై అడుగుతారు. లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప ప్రశ్నలు, పేరాస్లో విషయ పరిజ్ఞానం, ఆంగ్ల పఠనం, అవగాహనపై ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

1

పేపర్-2లో..
200 ప్రశ్నలు ఉంటాయి. అవి అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్‌ఎబిలిటీపై ప్రశ్నలు అడుగుతారు.

పేపర్-3లో..
సంబంధిత సబ్జెక్టులపై 200 ప్రశ్నలు అడుగుతారు.

ఐటీ పోస్టులకు..
నెట్వర్క్ చేయర్, ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్, ఇనుమెంటేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్రానిక్ సర్క్యూట్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ యాంటేగా, మైక్రోవేవ్ ఇంజినీరింగ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, డేటాబేస్ మేనేజ్ మెంట్, నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, మైక్రోప్రాసెసర్, టెలివిజన్ ఇంజినీరింగ్ రాజర్స్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, టెలిఫోన్ సిస్టమ్స్, మళ్లీ పెకింగ్ అండ్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ పై ప్రశ్నలు వస్తాయి.

పీజీవో పోస్టులకు..
మెకానికల్ ఇంజినీరింగ్, వర్క్ షాప్ టెక్నాలజీ, ఆటోమొబైల్ పవర్‌ప్లాంట్స్, ఫ్యూయిడ్ మెకానిక్స్ ఇంజినీరింగ్ మెటీరియల్, మిషల్ డ్రాయింగ్, మెకానిక్స్ డియర్, ఆటోమొబైల్ సర్వీసింగ్, నిర్వహణ, పరీక్షలు, మెటారు ట్రాన్స్ పోరు. ఫీట్ మేనేజ్ మెంట్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్, కంప్యూటర్స్, ఐటీ, ఆటోమొబైల్ టెస్టింగ్, డయాగ్నస్టిక్స్ తదితర ఆటోమొబైల్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి.

ఫింగర్ ప్రింట్ బ్యూరో పోస్టులకు..
కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఎంఎస్ ఆఫీస్, నెట్ వర్కింగ్ అండ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇక, కానిస్టేబుల్ పోస్టుల విషయానికొస్తే, పూర్తి సిలబస్‌ను విడుదల చేసింది. అందులో..

కానిస్టేబుల్ (ఐటీ, కమ్యూనికేషన్లు)..
సాంకేతిక పరిజ్ఞాన రాత పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఇందులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రేడియో, కంప్యూటర్ బేసిక్, టెలిఫోన్ సిస్టమ్ సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

కానిస్టేబుల్ (మెకానిక్ పోస్టులు)..
రాతపరీక్షలో 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. ఆటోమొబైల్ పరిచయం, స్పార్క్ ఇగ్నోషియన్ ఇంజిన్, పెట్రోలు, డీజిల్ ఇంజిన్ పరికరాలు, నిర్వహణ తదితర అంశాలపై అడుగుతారు.

కానిస్టేబుల్ (డ్రైవర్)..
వాహన నిర్వహలు, టైమింగ్ విధులు, రోడ్డు చట్టాలు, నిబంధనలు తదితర అంశాలపై 20 ప్రశ్నలు అడుగుతారు. 200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.