this is the education qualifications for group one posts
mictv telugu

గ్రూప్ 1 పోస్టులు : ఏ పోస్టుకు ఏ డిగ్రీ ఉండాలో తెలుసా

April 27, 2022

టీఎస్పీఎస్సీ 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే 2 నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఈ 503 పోస్టులలో 19 రకాల పోస్టులున్నాయి. ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు ఇలా ఉన్నాయి.

1. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీఓ, డీపీఓ, జిల్లా రిజిస్ట్రార్, ఏఓ, ఎంపీడీఓ, ఉపాధి అధికారి, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, డిప్యూటీ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మునిసిపల్ కమిషనర్ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ పాసయి ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి.
డీఎస్పీ, డిప్యూటీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులకు పురుషుల ఎత్తు 167.6 సెంటిమీటర్లు ఉండాలి. ఛాతీ కొలత 86.3 ఉండాలి. మహిళా అభ్యర్ధులకు ఎత్తు 152.5, బరువు 45.5 కిలోలు కలిగి ఉండాలి.

2. సాంఘిక సంక్షేమ ఏడీ ఉద్యోగాలకు డిగ్రీ ఉండాలి. దాంతోపాటు సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
3. ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్ లేదా ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన డిగ్రీ పాసయి ఉండాలి.
4. సహాయ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులకు కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథ్స్ సబ్జెక్టుల్లో మినిమం సెకండ్ క్లాస్ డిగ్రీ చేసి ఉండాలి.
5. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతో పాటు కార్మిక సంక్షేమానికి సంబంధించిన సామాజిక సేవలో పీజీ చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు.