This is the genealogy of crazy actress Sai Pallavi
mictv telugu

క్రేజీ నటి సాయి పల్లవి వంశ చరిత్ర ఇదీ.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి

June 16, 2022

This is the genealogy of crazy actress Sai Pallavi

తన నటన, నాట్యంతో తెలుగు నాట అశేష అభిమానులను సంపాదించుకున్న నటి సాయిపల్లవి. ఈ మధ్య కాలంలో ఇలాంటి నటి పరిశ్రమలో రాలేదంటే అతిశయోక్తి కాదేమో. ఫిదా నుంచి తాజాగా రిలీజవుతున్న విరాటపర్వం వరకు గ్లామరుకు దూరంగా కేవలం నటనా ప్రాధాన్యమున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలు కొంచెం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కశ్మీరీ హిందూ పండిట్ల హత్యకు, ఆవును తరలించే ముస్లింను చంపడాన్ని ఒకే గాటన కట్టి చేసిన వ్యాఖ్యలు ఆమెపై విమర్శలకు దారి తీసాయి. దీంతో చాలా మంది అసలీమె ఎవరు? వంశ చరిత్ర ఏంటి? వంటి విషయాలను తవ్వి తీశారు. వంశ మూలాల్లోకి వెళ్లగా టిప్పుసుల్తాన్ వరకు వీరి చరిత్ర వెళ్లింది. దాంతో చాలా మంది వీరి తెగ గురించి తెలుసుకొని ఖంగుతింటున్నారు.

సాయిపల్లవి కుటుంబం ప్రస్తుతం తమిళనాడు కోయంబత్తూరులో ఉంటున్నా, ఆమె తండ్రి నీలగిరి జిల్లాలోని కోటగిరి ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డారు. అంటే సాయి పల్లవి తాత గారు ఇప్పటికీ కోటగిరి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరు బడగ సామాజిక వర్గానికి చెందిన వారు. దీనర్ధం కన్నడలో ఉత్తరం అని. వీరు నీలగిరికి ఉత్తరాన ఉండే మైసూరు నుంచి వలస వచ్చారు. అప్పట్లో మైసూరుకు రాజైన టిప్పు సుల్తాన్ బలవంతంగా మతం మారుస్తుంటే దానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన వర్గం ఇది. టిప్పుసుల్తాన్ వద్ద మంత్రిగా పనిచేసిన పూర్ణయ్య తదితరులు వెన్నుపోటు పొడవడంతో వీరు వలస వెళ్లిపోయారు. ఒక్క బడగ వీరుడు 20 మంది టిప్పుసుల్తాన్ సైన్యానికి సమానం. వీరి దెబ్బకి టిప్పు సుల్తాన్ సైనికులు అప్పట్లో మెడ మీద ఇనుప పట్టీలు ధరించి తిరిగేవారు. వీరు నాట్యం చేస్తూ కూడా శత్రువల తలలను నరకడంలో ప్రావీణ్యులు. వారి జీన్స్ వల్లనే సాయి పల్లవికి పుట్టుకతో నాట్యకళ అబ్బిందని చెపుతారు. బడగ సామాజిక వర్గానికి 1951 వరకు ఎస్టీ హోదా ఉండేది. తర్వాత బీసీలుగా మార్చబడ్డారు. ఈ వివరాలన్నీ సోషల్ మీడియాలో రావడంతో వైరల్ అవుతోంది. కొందరు తమ వంశ చరిత్రను సాయిపల్లవికి పేరెంట్స్ చెప్పలేదేమోనని కామెంట్లు చేస్తున్నారు.