This is the last date to link Aadhaar-PAN card.
mictv telugu

ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి ఆఖరి తేది ఇదే..

November 20, 2022

ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి ఐటీ శాఖ చివరి గడువు విధించింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే అనేక సార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని తేల్చిచెప్పింది. ఆధార్‌తో లింక్ చేయకుండా ఉంటే పాన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉందని ఐటీశాఖ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత ఈ లింక్ కోసం రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ రూ. వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోవచ్చని చెబుతోంది.

కింధ విధంగా ఆధార్-పాన్ లింక్ చేసుకోవచ్చు…

* ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ లోకి‌వెళ్లాలి

* తర్వాత ఆధార్‌ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది

*అక్కడ మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి

*మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి

*దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన తర్వాత ధృవీకరించుపై క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్‌ తర్వాత మీ ఆధార్-పాన్ లింక్ చేయబడతాయి.