బాలు చివరి పాట ఇదే..  - MicTv.in - Telugu News
mictv telugu

బాలు చివరి పాట ఇదే.. 

September 25, 2020

This is the last song of the sp balu

కోట్ల హృదయాలను తీరని విషాదంలో ముంచెత్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 16కి పైగా  భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి అలరించారు. ఆయన పాడిన పాటల్లో ఎక్కువగా ఆల్ టైం రికార్డులుగా నిలిచాయి. ఆయన చివరిసారిగా ‘పలాస 1978’ సినిమాలో పాడారు. రఘు కుంచె సంగీతంలో బాలు ‘ఓ సొగసరి’ పాటను ఆలపించారు. లక్ష్మీ భూపాల సాహిత్యం అందించారు ఈ పాటకు. బాలుతో పాటు  బేబి స్వరం కలిపారు. 

దీనిపై ఆ చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ‘పలాస చిత్రంలో బాలు పాట పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బాలు నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. ఒక గొప్ప గాన గాంధర్వుడిని కోల్పోయాం. ఆయన లోటును ఎవరూ పూడ్చలేరు’ అని రఘుకుంచె తెలిపారు. కాగా, కరుణ కుమార్ దర్శకత్వం వహించిన పలాస సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.