This is the new jersey of Team India.. Here are the photos
mictv telugu

టీమిండియా కొత్త జెర్సీ ఇదే..ఫోటోలు ఇదిగో

September 19, 2022

టీమిండియా ఆటగాళ్లకు సంబంధించి, తాజాగా బీసీసీఐ ట్విటర్ వేదికగా వెల్లడించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటోలను వీక్షిస్తున్న క్రికెట్ ప్రియులు, నెటిజన్స్ ‘కొత్త జెర్సీ అదిరిపోయింది. టీమిండియా జట్టుకు ఆల్ ది బెస్ట్’ అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే..ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే నెలలో టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు జట్లలోని ఆటగాళ్లను ప్రకటించి, కొత్త జెర్సీలను ఆవిష్కరించాయి. ఇందులో భాగంగా ఇటీవలే బీసీసీఐ సైతం టీమిండియా జట్టును ప్రకటించింది. కానీ, కొత్త జెర్సీలను వెల్లడించలేదు.

 

ఈ క్రమంలో ఆదివారం బీసీసీఐ ముంబై వేదికగా కొత్త జెర్సీలను ప్రకటించింది. టీమిండియా ఆటగాళ్లు ధరించినా కొత్త జెర్సీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, ఈ జెర్సీతోపాటు ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్‌ను కూడా ప్రదర్శించింది. ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు ధరించిన జెర్సీలకు దగ్గరగా ఉంది. ఇది టీ20 జెర్సీ అని బీసీసీఐ వెల్లడించింది. భారత మహిళల జట్టుకు కూడా ఇదే అధికారిక జెర్సీ అని తెలుస్తోంది..