నంద్యాల ఉప ఎన్నిక ముగిసింది. ఫలితం రావాల్సి ఉంది. దాని కంటే ముందే వచ్చిన ఎగ్జిట్ ఫోల్ సర్వేలు నాయకుల్లో మరింత టెన్షన్ పెంచుతున్నాయి. టిడిపి, వైసీపీ నేతల మధ్య మాట లనుండి వార్ తుపాకీ కాల్పుల దాకా పోయింది. గెలుపుపై ఎవ్వరి అంచనాలు వారికున్నాయి. తామంటే తామే గెలుస్తామని ఎవరి ఈక్వేషన్లు వారు చెప్పుకుంటున్నారు. నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద జరిగిన సంచలనం పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఇట్లే అర్థం చేయించింది. మూడేళ్ల నుండి కొనసాగుతున్న వార్ ముదిరి ముదిరి నంద్యాల ఉప ఎన్నికల్లో బరస్ట్ అవుతున్నది.
సాధారణంగా ఎన్నికలు అయి పోయిన తర్వాత ఫలితం గురించి మాట్లాడుకుంటారు. ఏదో తోచిన వివరణలు ఇచ్చుకుని సరిపెట్టుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఫలితం తర్వాత కూడా ఈ హీట్ మరింత పెరిగేలా ఉంది. ఎన్నికల ప్రచారంలో నాయకులు చేసుకున్న విమర్శలు… కౌంటర్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. నెల రోజుల పాటు నంద్యాలను చుట్టూసేన నాయకులు గెలుపు పై బాగా అంచనాలు పెంచుకున్నారు. ఇది చాలాదన్నట్లు ఎగ్జిట్ పోల్స్ మరింత వేడిని పెంచుతున్నాయి. లగడపాటి సర్వే ఓ మాట చెప్తే మరో సర్వే మరో మాట చెప్తున్నది. రెండు వైపులా గెలుపుపై ధీమా పెంచుతున్నది.
వాస్తవం ఏమిటో ఇంకో మూడు రోజుల్లో ఎట్లాగూ తెలుస్తుంది. అంత దాకా కూడా అగేట్లు లేరు. ఇది కేవలం ఎన్నికల ఫలితంపై ఆధారపడిన రగడ కానట్లుంది. ఇద్దరు ముఖ్యనాయకులు ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక ఇది. పరువును ముందేసుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు దీన్ని లింక్ చేశారు. అంతే కాదు ఈ ఎన్నికల్లో ఓడితే భూమా అఖిలి ప్రియ ఏకంగా రాజకీయాలకు గుడ్ చెప్తానని సెలవిచ్చారు. మరిన్ని కారణాలున్నప్పుడు గరం ఈ స్థాయిలో కాక మరే స్థాయిలో ఉంటుంది.
అంతే కాదు ఎన్నకల సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల ఎక్స్ పర్ట్స్ ను పెట్టుకుని మరీ ప్రచారం చేశారు. తమ రాజకీయ అనుభవాన్ని రంగరించి మరీ ప్రచారాలు చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా ఎట్లా ఓడిపోతామనే ధీమాతో ఉన్నారు. కాబట్టే ఇంత స్థాయిలోఅక్కడ పంచాయితీ జరుగుతున్నది. తాజాగా నంద్యాలలో జరుగుతున్న ఘర్షణ, వైరీ వర్గాల ఆందోళనల వెనుక చాలా కారణాలే ముడిపడి ఉన్నాయి. దాని కారణంగానే ఎన్నికల హీట్ బాగా పెరుగుతున్నది. ఫలితం వచ్చిన రోజు పరిస్థితి ఇంకెట్లా ఉంటుందో మరి.