‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి తప్పించడంపై జగపతి స్పందన - MicTv.in - Telugu News
mictv telugu

‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి తప్పించడంపై జగపతి స్పందన

July 19, 2019

ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి సీనియర్ నటుడు జగపతి బాబు తప్పకున్నారని ప్రచారం జరుగుతోంది. జగపతిబాబుకు, ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి మధ్య వార్ జరిగినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం ఆయనను ఎంచుకున్నారు. ఈ సినిమా కథ చెప్పే సమయంలో దర్శకుడు జగపతికి చెప్పింది షూటింగ్‌లో చేయలేదని జగ్గూభాయి తప్పుకున్నారని వార్తలు వినవచ్చాయి.

షూటింగ్‌కు వెళ్లిన తర్వాత ఆ కథ మరోలా ఉండడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దర్శకుడితో ఆయనకు విబేధాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ జగపతి బాబు, దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ వీడియోను విడుదల చేశారు. 

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘సరిలేరు నీకెవ్వరు సినిమాలో నేను ఒక పాత్ర చేయాల్సి వుండే. కానీ, నా పర్సనల్ ఇష్యూల వల్ల నటించలేక తప్పుకున్నాను. అంతేగానీ అనిల్‌కు, నాకు మధ్య ఎలాంటి వార్ జరగలేదు. నా 33 ఏళ్ల కెరియర్‌లో నేను ఎవ్వరి జోలికి వెళ్లలేదు. నేను అందరితో మంచి సంబంధాలు కలిగివుంటాను’ అని పేర్కొన్నారు జగపతిబాబు.