కేసీఆర్ ప్రకటించినా.. జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు రావట్లేదో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ప్రకటించినా.. జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు రావట్లేదో తెలుసా?

March 18, 2022

ppp

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేల పోస్టుల భర్తీకి ఆమోదిస్తున్నట్లు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే సీఎం చెప్పినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. అందుకు కారణం రోస్టర్ విధానం ఇంకా ఖరారు కాకపోవడం అని తెలుస్తోంది. సవరించిన రిజర్వేషన్ల మేరకు రోస్టర్ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. సీఎస్ సోమేష్‌కుమార్ సైతం రోస్టర్ ప్రక్రియను తొందరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదీగాక, నియామకాలను పాత పద్ధతిలో చేయడానికి ఇప్పుడు వీలు పడదు. గతంలో జిల్లా స్థాయిలో కొన్ని పోస్టులు మాత్రమే ఉండేవి. కొత్త జిల్లాలు, మల్టీ జోన్ల ఏర్పాటు నేపథ్యంలో చాలా ఉద్యోగాలు జిల్లా స్థాయి పోస్టులుగా మారాయి. వాటిని జిల్లా నియామక కమిటీ ద్వారా భర్తీ చేయాలా? లేక, ఏదైనా బోర్డు ద్వారా భర్తీ చేయాలా అనేది ఇంకా స్పష్టంగా నిర్ణయించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.