This is the remuneration taken by the heroines for the casino campaign
mictv telugu

క్యాసినో ప్రచారానికి ఏ హీరోయిన్ ఎంత తీసుకుందో వివరాలు వచ్చేశాయి

July 29, 2022

విదేశాల్లో క్యాసినో నిర్వహణ, మనీలాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన వంటి అంశాలతో చీకోటి ప్రవీణ్‌పై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మాధవరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇళ్లతో పాటు మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. గురువారం చీకోటి ప్రవీణ్‌ను ఈడీ విచారించి కోర్టులో ఈసీఐఆర్ దాఖలు చేసింది. అయితే గోవా, నేపాల్‌లో క్యాసినో చట్టబద్ధం కాబట్టి తాను తప్పు చేయలేదని ప్రవీణ్ వాదన. ఇదిలా ఉండగా, ఇండో నేపాల్ సరిహద్దుల్లో జూన్ 10 నుంచి 13 వరకు క్యాసినో నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్యాసినోని ప్రమోట్ చేయడానికి పలువురు నటీనటులు వీడియోలు చేశారు. ఇందుకు సంబంధించి బాలీవుడ్, టాలీవుడ్ తారల పారితోషికాల లిస్టు ఒకటి బయటికి వచ్చింది. హాట్ బాంబ్ మల్లికా షెరావత్‌కి కోటి, అమీషాపటేల్ 80 లక్షలు, ఇషా రెబ్బా 40 లక్షలు, గణేష్ ఆచార్య 20 లక్షలు, ముమైత్ ఖాన్ 15 లక్షలు, డింపుల్ హయతీ 40 లక్షలు, గోవింద 50 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. దీంతో నోటీసులు ఇవ్వడానికి ఈడీ సిద్ధమవుతోంది.