ఇప్పటి వరకు  పొత్తుల కథ ఇదీ... - MicTv.in - Telugu News
mictv telugu

ఇప్పటి వరకు  పొత్తుల కథ ఇదీ…

October 25, 2018

కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో కూటమికి కేటాయించే సీట్లపై అంశం ఓ కొలిక్కి వచ్చినట్లే ఉంది. వరుస సమావేశాలు, అంచనాలు, అనుమానాల మధ్య కుస్తీలు పట్టి మిత్రులకు కొన్ని సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. తాను 90 స్థానాలు పోటీచేయడానికి రెఢీ అయింది. తొలి జాబితా కూడా ఒకటిరెండు రోజుల్లో విడుదల చేయడానికి సిద్దం అవుతున్నారట. తెలుగుదేశం పార్టీకి 15 స్థానాలు, టీజేఎస్‌కు 10 స్థానాలు, సిపిఐకి 4 స్థానాలు ఇవ్వడానికి ఒకే అన్నారట.

అభ్యర్థులను ప్రకటించడానికే చాలా సమయం తీసుకున్నారు. పొత్తుల్లో భాగంగా తమకు కావాల్సిన సీట్లు ఇవ్వకుంటే తాము   స్వతంత్రంగా పోటీ చేస్తామని జనసమితి ప్రకటించింది. సిపిఐ కూడా అతి తక్కువ స్థానాలు తీసుకునే అవకాశం లేదని కూడా చెప్పింది.This is the story of alliances till now ........తాను పోటీచేయాలనుకున్న 100 స్థానాల సంఖ్యను 90కి కుదించుకుని  కాంగ్రెస్ పార్టీ మిత్రులకు పంపిణీ చేసింది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 35 స్థానాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. తాము గెలుస్తామని గట్టి నమ్మకం ఉన్న స్థానాలను తీసుకోవాలని కాంగ్రెస్  పార్టీ మిత్రులను కోరినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పైనే ప్రధానంగా దృష్టిపెట్టింది. గతంలో పోటీ చేసిన స్థానాల్లోనే ఈసారి బరిలోకి దిగాలని భావిస్తున్నది. అందకు అనుగుణంగానే హైదరాబాద్ నగరంలోని పదికి పైగా స్థానాల్లో పోటీ చేయడానికి టిడిపి సిద్దం అయిందని  సమాచారం. ఈ మేరకు ముఖ్యనాయకులు ఇక్కడి నుండే పోటీ చేస్తారని అంటున్నారు. అందుకే పట్టుబట్టి మరీ ఎక్కువ స్థానాలు నగరం నుండే తీసుకున్నట్లు సమాచారం.

పార్టీకి చెందిన మరి కొంత మంది నాయకులకు ప్లేస్‌మెంట్ ఇవ్వడం కోసం  తెలంగాణ జిల్లాల్లో కూడా ఒకటి రెండు స్థానాలు ఇచ్చేందుకు సిద్దం అయినట్లు తెలుస్తున్నది. ఖమ్మం జిల్లాల్లో సత్తుపల్లి పక్కాగా తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నది. ఇక  మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఒకటి రెండు స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం.

ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా బలంగానే ఉంది కాబట్టి ఈ సీట్ల విషయంలో క్లారిటీ  ఇవ్వలేక పోయినట్లు సమాచారం. చంద్రబాబునాయుడుతో భేటీ అయిన తర్వాత సీట్ల విషయంలో పట్టువిడుపులుండాలని బాబుచేసిన సూచన మేరకు 20  స్థానాల నుండి తగ్గినట్లు తెలుస్తున్నది.

సిపిఐ కూడా మూడు నాలుగు స్థానాలు అయితే  తమకు కుదరదని చెప్పింది. కానీ పరిస్థితిని బట్టి నడుచుకోవాలని భావించిన ఆ  పార్టీ నాయకులు సీట్ల విషయంలో మెట్టు దిగినట్లు సమాచారం. అందుకే నాలుగు స్థానాలైనాసరే తమకు ఇబ్బంది లేదని చెప్పినట్లు  సమచారం.

అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత ఉమ్మడి ప్రచారం చేయాలని అనుకుంటున్నారట. సీట్ల పంపిణీ విషయంలో మరోసారి భేటీ అవుతారా లేక పోతే  ఇప్పుడు అనుకున్నట్లుగానే ముందుకెళ్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

దీని గురించి మరోసారి కలుస్తామని కొందరు నాయకులు అంటున్నారు. పరిస్థితులను బట్టి ముందకెళ్తామని అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే  పొత్తులు ఖారారు చేసుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు.