'This is the T20 World Cup team': England
mictv telugu

‘ఇదే టీ20 ప్రపంచ కప్ జట్టు’: ఇంగ్లండ్

September 2, 2022

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటకు ఎంతమంది అభిమానులు ఉన్నారో మాటల్లో చెప్పలేము. ఆయా దేశాల మధ్య ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ జరిగిన లేక వన్డే మ్యాచ్ జరిగిన అభిమానులు ఎగబడి చూస్తుంటారు. మరీ ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగితే, ఇక అభిమానుల ఆనందం, ఉత్కంఠ, ఆసక్తిని వర్ణించలేము. ఈ క్రమంలో త్వరలోనే జరగబోతున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లకు సంబంధించి, పలు దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటి నుంచే జట్లను సిద్దం చేయటం ప్రారంభించాయి. జట్టులో ఏ ఆటగాడికి స్థానం కల్పించాలి? ఎవరికి విశ్రాంతి ఇవ్వాలి? అనే దానిపై చర్చోపచర్చలు జరుపుతున్నాయి.

ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు తమ జట్టు రెడీ అయ్యిందని, ఈసారి టీ20 మ్యాచ్‌ల్లో ఆడబోయే ఆటగాళ్లు వీళ్లేనంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈసారి గాయాలతో జట్టుకు దూరమైన సీమర్లు క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌ను కూడా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసినట్లు తెలిపింది. మొత్తం 15 మంది ఆటగాళ్లు, ముగ్గురు రిజర్వు ప్లేయర్లతో బృందాన్ని రెడీ చేశామని పేర్కొంది.

‘ఇదే టీ20 ప్రపంచ కప్ ఆడే జట్టు’ అంటూ ఇంగ్లండ్ టీం సభ్యుల పేర్లను వెల్లడించింది. ”జోస్ బట్లర్ (కెప్టెన్), మొయీన్ అలీ, జొనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, శామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఇక..ట్రావెలింగ్ రిజర్వులు: లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, టైమల్ మిల్స్” అని వివరాలను వెల్లడించింది.