This job seeker delivers ‘resume’ in box of pastries wearing Zomato uniform
mictv telugu

ఐడియా అదిరింది.. ‘జోమాటో’లో రెజ్యూమ్ డెలివరీ

July 8, 2022

థింక్ డిఫరెంట్.. ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్‌కు ‘గుంపులో గోవింద’ లా కాకుండా.. మనకంటూ మనమే స్పెషల్ గా ఏదైనా ట్రై చేస్తేనే.. ఎవరి దృష్టిలోనైనా ఈజీగా పడతాం. అలాంటి ప్రయత్నమే చేశాడు అమన్ ఖండేల్‌వాల్ అనే ఓ నిరుద్యోగి. తన క్రియేటివిటీకి అందరు ఫిదా అవుతున్నారు. ఉద్యోగ వేటలో ఉన్న అమన్.. ఎన్నో కంపెనీల చుట్టూ చేతినిండా రెజ్యూమ్ లతో తిరిగాడు. కానీ ఫలితం శూన్యం. తన సీవీ డస్ట్ బిన్ పాలవకుండా, కంపెనీల యాజమాన్యాలు తప్పకుండా పరిశీలించేలా అతడు ప్లాన్ చేశాడు. సదరు నిరుద్యోగి జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా మారి ఒక పేస్ట్రీ బాక్స్‌లో స్వీట్స్‌తో సహా రెజ్యూమ్‌ను కంపెనీలకు సెండ్ చేస్తున్నారు.

“దాదాపు అన్ని రెజ్యూమ్‌లు డస్ట్ బిన్ పాలవుతాయి. కానీ నా రెజ్యూమ్ మాత్రం మీ కడుపులోకి చేరుతుంది.” అని రాసిన ఓ పేపర్‌ను ఈ నిరుద్యోగి బాక్స్‌పై అంటించి పంపిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తానే ఓ ట్విట్టర్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. “ఇది మామూలు క్రియేటివిటీ కాదు భయ్యా, నీ ఐడియా సూపర్!” అంటూ కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం అమన్ ఖండేల్‌వాల్ ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీలో మేనేజ్‌మెంట్ ట్రైనీ లేదా అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అమన్ చేసిన పనిపై జొమాటో కంపెనీని కూడా ఆశ్చర్యపరిచింది. హయ్, అమన్ నీ ఐడియా సూపర్.. ఎగ్జిక్యూషన్ వేరే లెవెల్.. వేషధారణ మాత్రం ఏం బాగోలేదు.. కానీ ఈ సీవీ వల్ల నీకు మంచి జాబ్ వచ్చిందని ఆశిస్తున్నామని జొమాటో పేర్కొంది. అయితే కొందరు నెటిజన్లు అమన్‌ను తెగ పొగిడేస్తున్నారు.