బాలకృష్ణ అనే వ్యక్తి ఉన్నారు. ఇతనికో ప్రాబ్లెమ్ ఉంది. ఇలా ఎవ్వరికీ ఉండదేమో బహుశా. బాలకృష్ణ అందరిలా అన్నం తినలేరు. అన్నమే కాదు ఇంే ఆహారమూ తినలేరు. ఒక్క కొబ్బరి తప్ప. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకూ అతని ఆహారం కొబ్బరి మాత్రమే. అది తింటేనే అతను బతుకుతాడు, ఇంకేం తిన్నా అతనికి ప్రమాదమే. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.
ట్రావెల్ ఇన్ ఫ్లూయర్, నటి అయిన షెహనాజ్ బాలకృష్ణకు ఉన్న ఈ ఆరోగ్య సమస్యను సోషల్ మీడియాలో పెట్టారు. అతని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పారు. బాలకృష్ణ కొన్ని రోజులుగా ఏమీ తినలేకపోతున్నారు. ఏం తిన్నా పడటం లేదు. దాంతో ఆహారం తీసుకోవడం మానేశారు. దీనివల్ల బాగా నీరసపడిపోయారు. ఎందుకిలా అవుతోంది అని డాక్టర్లు పరీక్షిస్తే బాలకృష్ణకు జెర్డ్ అనే ప్రాబ్లెమ్ ఉన్నట్లు తెలిసింది. దాని తరువాత నుంచి ఆయన కొబ్బరిని మాత్రమే తింటూ, ఆ నీరే తాగుతూ బతుకుతున్నారు. కొబ్బరిలో ఉంటే క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, మినరల్స్ తో బాలకృష్ణ తిరిగి మామూలు మనిషి అయ్యారు.
ఎలక్ట్రోలైట్స్ సమతుల్యానికి కొబ్బరి సాయపడుతుంది. ఫీహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ ను నియంత్రిస్తుంది. కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ ఉంటాయి. ప్రొటీన్లు అయితే అసలు ఉండవు. కేవలం కొబ్బరి మాత్రమే తింటూ ఎక్కువ రోజులు బతకలేరని డాక్టర్లు అంటున్నారు. కొబ్బరి మాత్రమే తినేవారికి పొటాషియం పెరిగిపోతుందని అది ఒంటికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కానీ బాలకృష్ణకు వేరే ఆప్షన్ లేదు. ఆయన ఈ డైట్ ను 24 ఏళ్ళుగా ఫాలో అవుతున్నారు. కొబ్బరే తిన్నా, మరేమ్ తిన్నా ఆయనకు సమస్యే.