భర్త రాగానే, చెడ్డీతో దూకేసిన ప్రియుడు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

భర్త రాగానే, చెడ్డీతో దూకేసిన ప్రియుడు (వీడియో)

October 12, 2020

Bathukamma Song 2020

భార్య ప్రియుడితో బెడ్ రూంలో ఉంది. అదే సమయంలో అనుకోకుండా భర్త డోర్ కొట్టాడు. ఆ సమయంలో సాధారణంగా భార్యలు ఏం చేస్తారు. కొందరు లవర్లను మంచం కింద దాస్తారు. కొందరు బీరువాలో దాస్తారు. మరికొందరు వెనుక డోర్ నుంచి పంపించి భర్తకు వెల్ కం చెబుతారు. కానీ, ఎక్కడ జరిగిందో తెలియని ఈ వీడియోలో మాత్రం ఆ భార్య లవర్‌ను బాల్కనీ నుంచి తాడుతో కింది దింపే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైంది. భర్త వచ్చిన టెన్షన్‌లో లవర్‌కి బట్టలు వేసుకునేంత సమయం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు అండర్‌వేర్‌తోనే కిందికి గదిగడం మొదలు పెట్టాడు. కానీ, వారి ప్రయత్నం విఫలం అయింది. 

 

భర్త ఆమె లవర్‌ను చూసేశాడు. తాడు సహాయంతో కిందికి దిగుతున్న లవర్‌ను పైకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ, లవర్ చాకచక్యంగా వ్యవహరించి ఒక ఫ్లోర్ కిందికి దిగాడు. అక్కడ ఏం జరుగుతోందో తెల్సిన ఆ కింది ఫ్లోర్ మహిళ లవర్‌ను చీపురుతో నాలుగు తగిలించింది. ఈ తతంగాన్ని కింద ఉన్న కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎన్ని కష్టాలో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పాపం ఆ భార్య పరిస్థితి ఏమై ఉంటుందో అని భాధను వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఇది ప్రాంక్ వీడియో అయి ఉండవచ్చని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.