'ఇండియన్ గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019'గా మోదీ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఇండియన్ గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’గా మోదీ ట్వీట్

December 10, 2019

Modi00002

ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఇలా అన్ని ప్రముఖ సోషల్ మీడియా సైట్‌లలో ఆయనకు ఖాతాలున్నాయి. రెగ్యులర్‌గా వాటిలో పోస్ట్‌లు పెడుతుంటారు. ముఖ్యంగా ట్విటర్‌లో ఆయనకు 51 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌లో అత్యంత ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా కొనసాగుతురన్నారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సందర్భంలో సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ విజయీ భారత్ అంటూ మోదీ ట్విటర్‌లో ఇచ్చిన నినాదం విశేష జనాదరణ పొందింది. ఈ ట్వీట్‌ను ఇండియన్ గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019గా ట్విటర్ ప్రకటించింది. ఈ ట్వీట్‌కు ఇప్పటిదాకా 4,20,000 మంది లైక్‌లు కొట్టగా.. 1,17,100 సార్లు రీట్విట్ చేశారు. మే 23న వెలుబడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం ఖరారైన తరువాత ఆ రోజు మధ్యాహ్నం 2.42 గంటలకు మోదీ ఈ ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మొత్తం 353 స్థానాల్లో విజయం సాధించింది.