అద్దెకు బాయ్‌ఫ్రెండ్లు.. గంటకు 3 వేలు.. నో సెక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

అద్దెకు బాయ్‌ఫ్రెండ్లు.. గంటకు 3 వేలు.. నో సెక్స్

October 18, 2018

ytyఆధునిక జీవితం.. ముఖ్యంగా నగరజీవితం ఒంటరితనానికి సంకేతం. చుట్టూ ఎంతమంది ఉన్నా నిత్యం ఏదో కోల్పోయినట్లు ఫీలవుతుంటారు చాలామంది. ముఖ్యంగా వివాహం కానివారికి, పెళ్లయి విడిపోయిన వారికి, భగ్నప్రేమికులకు ఇది పెద్ద సమస్య. ఉద్యోగం చేస్తున్నంతసేపూ కనిపించని ఒంటరితనం ఆఫీసు నుంచి బయటికి రాగానే గుర్తుకొస్తుంది. పెళ్లయితే తిక్క కుదురుతుందని అని మోటుగా చెప్పినా పెళ్లితో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

rtrt

 

అయితే కెరీర్ అనో, మరొకటనో పెళ్లిని వాయిదా వేసుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. అసలు పెళ్లి అనే జంజాటమే వద్దనేస్తున్నారు కొందరు. సహజనం బాగుంటుంది కానీ, దానితోనూ సమస్యలున్నాయంటున్నారు. మన దేశంలో అబ్బాయిలతో పోలిస్తే ఒంటరి అమ్మాయిలు ఎదుర్కొనే ‘ఇబ్బందులు’ ప్రత్యేకమైనవి. అబ్బాయిలు బోలెడు మంది గర్ల్ ఫ్రెండ్లతో స్వేచ్ఛగా తిరుగుతుంటారు కదా.  మరి అమ్మాయిలకు మాత్రం ఆ హక్కు ఎందుకుండకూడదు? ఈ ఆలోచనలోంచి పురుడు పోసుకుందే ‘అద్దెకు బాయ్ ఫ్రెండ్’ పథకం. ఇది విదేశాల్లో ఇప్పటికే బాగా అమల్లో ఉంది. మన దేశానికి మాత్రం రెండు నెలల కిందటే వచ్చింది. ముంబై యువతులను తెగ ఆకర్షిస్తోంది. రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ మొబైల్ యాప్ ద్వారా అబ్బాయిలను అమ్మాయిలు బుక్ చేసుకుంటున్నారు. మానసిక ఆందోళనకు విరుగుడుగానే ఈ బాయ్ ఫ్రెండ్లు వస్తారు తప్పితే వారికి మరెలాంటి దురుద్దేశాలూ ఉండవు. కౌశల్ ప్రకాశ్ అనే 29 ఏళ్ల యువకుడు ఈ యాప్ ప్రారంభించాడు.

tty

ఎంపిక ఎలా? ఏం చేస్తారు?

అద్దెకు వెళ్లే యువకులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఏ విషయాన్నీ దాచకూడదు. అలవాట్లు, మానసిక, శారీరక ఆరోగ్యాలు, ఇష్టాయిష్టాలు వంటివన్నీముందే చెప్పాలి. నిర్వాహకులు ఆ వివరాలను చెక్ చేస్తారు. ఎంపిక అంత సులభమేమీ కాదు. శల్య పరీక్ష్ టైపన్నమాట. అది ముగిశాక విజేతలను కస్టమర్లకు అందుబాటులో ఉంచుతారు. మోడల్, కామన్‌మేన్, ఉద్యోగి, బ్యాచిలర్, కాలేజీ స్టూడెంట్.. వంటి కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ బట్టి రేట్లు ఉంటాయి. మోడల్స్ ఎక్కువ రేటు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివరాలన్నీ తెలుసుకుంటున్నారంటే బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ గట్రా చేస్తారా అని కాదు. ఈ అద్దె తతంగంలో అసలు సెక్స్ ప్రసక్తే ఉండదు. పేరులోనే ఉన్నట్లు ఫ్రెండ్.. అంతే.. అబ్బాయి కేవలం స్నేహితుడిగానే ఉండాలి. అతడు మగవేశ్య కాదు.. ఆమె చెప్పినట్లు రాముడు మంచి బాలుడు టైపుతో నడుచుకుంటే చాలు.

కావాలంటే గడువు పెంచేసుకోవచ్చు.

rtt

అబ్బాయికి గంటకు సగటున రూ. 3 వేలు చెల్లించాలి. నచ్చితే గంటకు ఇంతచొప్పున మరికొన్ని గంటలు ఉంచేసుకోవచ్చు. అయితే గరిష్టంగా మూడు, నాలుగు గంటలు మాత్రమే అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరోజు మొత్తం కావాలంటే ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. అంతా క్యాబ్ సర్వీసుల తతంగంలా ఉంటుంది. ఒకరికి అద్దెకు వెళ్లిన అబ్బాయి.. నిర్ణీత గడువు తర్వాత మరో అమ్మాయి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అతడు ఏం తిన్నా, ఏం తాగినా, ఖర్మ కాలి ఏదన్నా కొన్నా.. ఆ  ఖర్చంతా అమ్మాయిలే భరించాల్సి ఉంటుంది. అయితే అబ్బాయిలను రహస్య, నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లకూడదు. కాస్త చుట్టూ మనుషులు తిరిగే ప్రాంతాల్లోనే వారితో గడిపాలి..!!