ఏటీఎంలో గలీజ్ పని.. అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏటీఎంలో గలీజ్ పని.. అరెస్ట్

May 13, 2019

ఈమధ్య ఏటీఎంల వద్ద కాపుగాసి దోచుకునే దొంగలు చాలా ఎక్కువయ్యారు. దీంతో జన సంచారం లేని ఏటీఎంలలోకి వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు జనాలు. కత్తులు, తుపాకులతో బెదిరించి అందినకాడికి దోచుకుని పారిపోతున్నారు. కానీ, ఒకతను ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఏటీఎంలోకి వెళ్లి ఓ యువతికి తన మార్మాంగాన్ని చూపించాడు. తొలుత అతణ్ని చూసిన ఆమె ఏటీఎం దొగేమో అనుకుంది. కానీ, అతడు ఆమెను చూడగానే జిప్పు తీసి మార్మాంగాన్ని బయట పెట్టాడు. అదంతా ఆమె వీడియో తీసి పోలీసులకు చూపించింది. వెంటనే పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. ములంద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలోకి డబ్బులు డ్రా చేయడానికి వెళ్లింది ఓ 23 ఏళ్ల యువతి. అప్పుడే అందులోకి ఓ 35 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. రాగానే ఆమెను అదోలా చూస్తూ జిప్పు తీసి తన మార్మాంగాన్ని చూసిస్తూ అసభ్యంగా మాట్లాడాడు. ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. డబ్బులిస్తాను తన కోరిక తీర్చమని కోరాడు. ఆ యువతి తొలుత భయపడింది. తర్వాత ధైర్యం తెచ్చుకుని అతని క్రూర చర్యను వీడియో తీసింది. అతను వెళ్లిపోయాక బయట కొంతదూరంలో వున్న పోలీసులకు ఆ వీడియో చూపించింది. పోలీసులు అతన్ని అనుసరించి పట్టుకుని కటకటాల వెనకకు నెట్టారు.

ఈ వీడియోను ఆమె ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘ తెల్లవారుజాము 3 గంటలు సమయంలో నేను ఏటీఎంలోకి వెళ్లాను. ఏటీఎంలో ఓ వ్యక్తి తన మర్మాంగాన్ని బయటకు తీసి చూపించాడు. నన్ను తాకేందుకు ప్రయత్నించాడు. డబ్బులు కూడా ఇస్తానన్నాడు. అప్పుడు నాకు చాలా భయమేసింది. అతడి పైశాచికత్వాన్ని మొబైల్‌తో వీడియో తీశాను. ఏటీఎం నుంచి బయటకు వెళ్లాక లక్కీగా పోలీస్ వాహనం కనిపించింది. పోలీసులకు ఈ వీడియో చూపించాను. వాళ్లు అతన్ని పట్టుకున్నారో లేదో నాకు తెలీదు. కానీ, ఏటీఎంలో కెమెరాలు ఉంటాయని తెలిసి కూడా అతడు మర్మాంగాన్ని చూపడానికి తెగించాడు. ఇది ఎప్పటికి ఆగుతుంది?’ అని ట్వీట్ చేసిందామె. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.