ఇదేం భరతనాట్యంరా అయ్యా.. తికతికథై (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం భరతనాట్యంరా అయ్యా.. తికతికథై (వీడియో) 

August 13, 2020

This Paris-based duo’s fusion of hip-hop and Bharatanatyam has taken social media by storm.

కరోనా సమయంలో ఇళ్లల్లో ఉంటున్న కళాకారుల క్రియేటివిటీ పీక్స్‌కు వెళుతోంది. కథలు రాసేవాళ్లు కొత్తగా రాసుకుంటున్నారు. ప్రపంచ సినిమాలను చూసేవారు అదే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు భరత నాట్యానికి వెస్ట్రన్ కల్చర్‌ను జోడించారు.   భరతనాట్యం అంటేనే సాంప్రదాయబద్ధమైన డాన్స్ ప్రక్రియ అలాంటిదానికి వెస్ట్రన్ జోడిస్తే ఎలా ఉంటుందో చూపే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్యారిస్‌కు చెందిన ఇద్దరు బాలికలు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని కొత్తరకం నాట్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీంతో వారికి ప్రశంసలే ప్రశంసలు అందుతున్నాయి. 

 

 

View this post on Instagram

 

#HybridBharatham I EPISODE 3. Hey @jackharlow, whats poppin ? 🍯 ➖⁣⁣⁣⁣ I call this #HybridBharatham and this is my way of mixing 2 styles that I love. Hip-Hop will always be my first love, but I have a big affection for Bharatham. I’m not an expert of Bharatham yet, but I will be. 🤟🏾⁣⁣⁣ ➖⁣⁣⁣⁣ 𝐃𝐚𝐧𝐜𝐞𝐫𝐬 : @orlane_dede 𝐱 @usha_jey⁣⁣ 𝐂𝐡𝐨𝐫𝐞𝐨𝐠𝐫𝐚𝐩𝐡𝐲 : @usha_jey ⁣⁣⁣⁣ 𝐓𝐫𝐚𝐜𝐤 𝐜𝐮𝐭 : @kidathegreat 𝐱 @baileysok 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐭𝐡𝐚𝐧𝐤𝐬 : @saja.sathiya 𝐱 @ithaj_muah ➖⁣⁣⁣⁣ #whatspoppin #jackharlow #hiphop #dance #ilovethisdance #baratham #bharatham #bharathanatyam #barathanatyam #tamil #tamildance #ghettostyle

A post shared by Usha Jey (@usha_jey) on

ఓర్లీన్ దేడే, ఉషా జే అనే ఇద్దరు బాలికలు ఇంట్లోనే హిప్-హాప్, భరతనాట్యం కలయికతో యునీక్‌ డ్రాన్స్‌ స్టైల్‌ను చేసి చూపించారు. ఒకే మిక్సీలో రెండు చట్నీలు కలిసినట్టు.. రెండు నృత్యరీతులను మిళితం చేసి కొత్త డ్యాన్స్ ఫ్లేవర్‌ను పరిచయం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఎందరినో అలరిస్తోంది. కొందరు నెటిజన్లు ఈ డాన్సుకు ఫిదా అయిపోయి ‘హైబ్రిడ్ భరతనాట్యం’ అని పేరు పెట్టారు. జాక్ హార్లోకు చెందిన వాట్స్ పాపిన్కు క్లాసికల్ స్టెప్పులను మిళితం చేస్తూ హిప్-హాప్ కళా ప్రక్రియలో వీరిద్దరూ ప్రదర్శించారు. ఈ వీడియోను ఉషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా వైరల్‌గా మారింది. తన డాన్స్ పై ఉష మాట్లాడుతూ.. ‘8-9 సంవత్సరాల వయసు నుంచి హిప్-హాప్ చేస్తున్నాను. అదే సమయంలో భరతనాట్యంను 20 సంవత్సరాల వయస్సులో నేర్చుకోవడం ప్రారంభించాను. ఈ రెండు నృత్యాల కలయికతో కొత్త రకం డ్యాన్స్‌ సిద్ధం చేయడం కొత్త అనుభూతినిస్తోంది’ అని తెలిపారు.