ఈ ఫోన్ కు ఛార్జింగు  అవసరమే లేదు...ఎందుకంటే..... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఫోన్ కు ఛార్జింగు  అవసరమే లేదు…ఎందుకంటే…..

July 7, 2017

అరే… ఎంత పనైంది… ఇంట్లో  బ్యాటరీ మర్చిపోయాను… అయ్యో  పొద్దున్నే ఛార్జింగ్ పెట్టాలని అనుకున్నాను… పన్లో పడి మర్చే పోయాను… చాలా కాల్స్ అటెమ్ట్ చేయాలి… ఏం చేయాలబ్బా…  ఇలాంటి డౌట్లు ఇక అవసరం లేదు. బ్యాటరీ  లెస్ ఫోన్లు ఇంకెంతో దూరంలో లేవు. కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో బ్యాటరీ లేని  సెల్ ఫోన్ తయారు చేశారు. దాన్ని పరీక్షించి చూశారు. అది సక్సెస్ కూడా అయింది.  సెల్ ఫోన్ రంగంలోనే కొత్త ఆవిష్కరణ చేశామని అంటున్నారు సైంటిస్టులు.

అమెరికాలోని  వాషింగ్టన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ గొల్లకోట దీని గురించి చెప్పారు. కేవలం రేడియో సిగ్నళ్లు, కాంతి నుండి ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుందట. బ్యాటరీ సెల్ ఫోన్ ద్వారా కాల్స్ చేశారట. కాల్స్ రిసీవ్ చేసుకున్నారట. హోల్డ్ లో పెట్టారట. స్కైప్ ద్వారా వీడియో కాల్స్ కూడా చేశారట.  అయితే ప్రస్తుతం దీన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తేలేదు. తేవడానికి  ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.

జీరో పవర్ తో  పనిచేసే తొలి సెల్ ఫోన్ ఈ యూనివర్సిటీ పరిశోధకులు  తయారు చేసినట్లే. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు దాని మైక్రో ఫోన్, స్పీకర్ ద్వారా వచ్చే చిన్నపాటి కంపనాలను తనకు అనకూలంగా మలుచుకుంటుదని  సైంటిస్టులు చెప్తున్నారు. కేవలం పదేళ్ల కాలంలోనే సెల్ ఫోన్ల తయారీలో, వాడకంలో ఊహించని  మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇదో ఆవిష్కరణ. ఇదే నిజమైతే దాంతో పాటు కొత్త సమస్యలు కూడా వస్తాయి కావొచ్చు. దానికి రెఢీగా ఉండాలి మరి.