కాస్త తెలివి ఉండాలే కానీ ఈ కాలంలో డబ్బు సంపాదించడానికి బోలెడు మార్గాలు. మనలో ఉన్న ఏదో ఒక టాలెంట్‌ని గుర్తించి.. అందుకు తగ్గట్లుగా కొంచెం కృషి చేస్తే మంచి ఉద్యోగంతోపాటు మంచి జీతమూ వస్తుంది. న్యూయార్క్ కి చెందిన ఆష్లీ పెల్డన్ అదే కోవకు చెందుతుంది. ఆమెలో ఉన్న టాలెంట్ ఏంటంటే పెద్దగా అరవడం. ఏంటీ? అరిస్తే.. ఊరికే డబ్బులిచ్చేస్తారా? అనే సందేహం మీకు కలగొచ్చు. కానీ కచ్చితంగా ఇస్తారు. హాలీవుడ్ చిత్రాలు హారర్ మూవీస్ కి పెట్టింది పేరు. ఆ సినిమా బ్యాక్ డ్రాప్లో వచ్చే భయంకరమైన అరుపులను తన గొంతుతో భీకర శబ్ధం చేస్తూ ప్రేక్షకుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నది ఈ స్పెషల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్.
తన ఏడేళ్ల వయసులో అనుకోకుండా ‘ఛైల్డ్ ఆఫ్ యాంగర్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. అందులో ఆ క్యారెక్టర్ అనుభవించే వేదన, భావోద్వేగాలకు తగినట్లుగా అరుపులు, కేకల్ని తన గళంలో వినిపించి పాత్రకు ప్రాణం పోసింది. మొదటి సినిమాతోనే తనలో ఉన్న ప్రతిభ బయటపడింది.. అదే మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇక దానినే కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. 25 సంవత్సరాలుగా ఈ వృత్తితో అనుబంధం ఉన్న ఆష్లీ ఇప్పటి వరకు 40కి పైగా సినిమాలు చేసింది. ఇలా తన నైపుణ్యంతో ఓవైపు పేరు ప్రఖ్యాతులే కాదు.. మరోవైపు కోట్లలో డబ్బూ సంపాదిస్తోందీ. మనలో ఉన్న ఏ ట్యాలెంటూ వృథా కాదని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే నలుగురిలో ఒక్కరిగా గుర్తింపు సంపాదించచ్చని చెబుతోంది. ఒకసారి ఆమె గొంతు విని మీరూ కూడా ఇలా ట్రై చేయండి.
When she said “ahhh”, I felt that @ashleypeldon pic.twitter.com/6FbtgB0YhZ
— 60 Second Docs (@60SecDocs) January 28, 2022