This time I was disappointed.. Nadi Puchi: Chiranjeevi
mictv telugu

ఈసారి నిరాశపర్చను..నాదీ పూచీ: చిరంజీవి

September 29, 2022

 

తెలుగు సినీ ప్రియులకు మెగస్టార్‌ చిరంజీవి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన హీరోగా కేరీర్ ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు విభిన్న పాత్రలు చేస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, దాదాపు 150 పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు, సినీ కార్మికులకు, అభిమానులకు, ఆపదలో ఉన్నవారికి తనవంతు సహాయాన్ని అందిస్తూ, చిరుగా, చిరంజీవిగా అభిమానుల గుండెల్లో ఎప్పటికి చేరిగిపోని ముద్రవేసుకున్నారు.

”ఆచార్యతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఇంకా ఉంది. కానీ, ఈ గాడ్ ఫాదర్‌తో ఆకట్టుకుంటా. ఈ చిత్ర విజయానికి నాదీ పూచీ. నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా వర్షం పడుతుంది. ఇవాళ మా ప్రీరిలీజ్ కార్యక్రమంలో వర్షం పడటం ఆ భగవంతుడి ఆశీర్వాదమే అనుకుంటున్నా. గాడ్ ఫాదర్ సినిమా నేను చేయడానికి కారణం రామ్ చరణ్. నీకున్న ఇమేజ్‌కి ఈ సినిమా చేస్తే బాగుంటుంది అన్నాడు. అలాగే, దర్శకుడిగా మోహన్ రాజా ఈ సబ్జెక్ట్ బాగా డీల్ చేయగలడు అని సూచించాడు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది. అయితే, జయాపజయాలు అందరికీ సహజమే.

కానీ, ఈ సినిమాతో ఆ బాధ తీరిపోతుంది. గాడ్ ఫాదర్ సినిమా మీ అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విజయానికి నాదీ పూచీ. నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కగా కుదిరారు. నాకు సపోర్ట్‌గా ఉండే పాత్రలో సల్మాన్‌ఖాన్ మెప్పిస్తాడు. చరణ్ అడగగానే సల్మాన్ కథ కూడా వినకుండా నటించేందుకు ఒప్పుకున్నాడు” అని అన్నారు.

ఇటీవలే చిరంజీవి హీరోగా, రాంచరణ్ కీలక పాత్రలో నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి ప్రేక్షకులను ఎంతమాత్రం నిరాశపర్చననీ, తనదీ పూచీ అంటూ మెగస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు గాడ్ ఫాదర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కాబోతుంది.