ఈసారి ఆంజనేయ విగ్రహం ముక్కలు ముక్కలు  - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి ఆంజనేయ విగ్రహం ముక్కలు ముక్కలు 

September 18, 2020

This time the Anjaneya statue was torn to pieces

ఏపీలో అంతర్వేది రథం దగ్దం ఘటన తాలూకు మంటలు ఇంకా చల్లారనే లేదు. అప్పుడే మళ్లీ రాష్రంలో విగ్రహాల ధ్వంసం ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో వరుస విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది అనడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. అనంతపురం జిల్లాలోని కొల్లూరు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమంతుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసంచేశారు. కల్యాణదుర్గం మండలం బొట్టువానపల్లిలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం అమావాస్య కావడంతో స్థానికులు గుడి ప్రాంగణంలోని ధ్వజస్థంభం వద్ద పూజల నిర్వహించారు. 

తెల్లారేసరికి ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం అయి ఉంది. శుక్రవారం ఈ ఘటనను  చూసి స్థానికులు షాక్ అయ్యారు. విగ్రహం తలభాగాన్ని, చేయి భాగాన్ని దుండగులు వేరు చేశారు. దేవాలయం పైభాగంలోని రామ, లక్ష్మణ, సీత విగ్రహాల పక్కన ఆంజనేయ విగ్రహం ఉంది. అయితే దుండగులు ఆ మూడు విగ్రహాలను వదిలేసి హనుమంతుడి విగ్రాహాన్ని మాత్రమే ఎత్తుకొచ్చి ధ్వంసం చేశారు. ఆంజనేయస్వామి విగ్రహ ధ్వంసంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇదిలావుండగా మరో ఘటనలో.. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం తాళాలను పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు నందీశ్వరుని విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసంచేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను అర్చకుడు అత్తలూరి యుగంధర్‌ శర్మ గురువారం ఉదయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.