ఈసారి ట్రోఫీ గెలుస్తాం: సన్‌రైజర్స్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి ట్రోఫీ గెలుస్తాం: సన్‌రైజర్స్‌

March 14, 2022

 bfdb

ఐపీఎల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 2022 ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మ్యాచ్‌లు ప్రారంభమైతాయి. ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రికెటర్ ఆటను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సన్నద్ధమవుతోంది. నటరాజన్‌, విష్ణు వినోద్‌, సౌరభ్‌ దూబే, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌, ప్రియమ్‌ గార్గ్‌ తదితర ఆటగాళ్లు జట్టులో చేరారు. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో అనుబంధం గురించి ఫ్రాంఛైజీ క్రికెటర్లు మాట్లాడిన వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా 21 ఏళ్ల ప్రియమ్‌ గార్గ్‌ మాట్లాడుతూ..”గతంలో రెండేళ్లపాటు ఈ జట్టులో ఉన్నా. మళ్లీ ఇప్పుడు ఇలా.. ఈసారి మేము ట్రోఫీ గెలుస్తాం అని మనసు పూర్తిగా భావిస్తున్నా” అని విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌కు మద్దతుగా నిలిచిన అభిమానులు ఇక ముందు కూడా ఇలాగే సపోర్టు చేయాలని విజ్ఞప్తి చేశాడు. మీ అండ మాకెంతో ముఖ్యమని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌-2022:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యులు వీరే:

కేన్‌ విలియమ్సన్‌( కెప్టెన్‌), అబ్దుల్ సమద్ ,ఉమ్రాన్ మాలిక్‌, నికోలస్‌ పూరన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ త్రిపాఠి, రొమారియో షెపర్డ్‌, అభిషేక్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జన్సెన్‌, టి నటరాజన్‌, కార్తీక్‌ త్యాగి, ఎయిడెన్‌ మార్క్రమ్‌, సీన్‌ అబాట్‌, గ్లెన్‌ ఫిలిప్‌, శ్రేయస్‌ గోపాల్‌, విష్ణు వినోద్‌, ఫజల్‌ హక్‌ ఫారుఖి, జె సుచిత్‌, ప్రియమ్‌ గార్గ్‌, ఆర్‌ సమర్థ్‌, శశాంక్‌ సింగ్‌, సౌరభ్‌ దూబే.