ఈ ఇంత పనిచాలు. ఇంత కంటే జనం కూడా పెద్దగ కోరేదేమీ ఉండదు. పది మందీ మెచ్చేది కాదు… ఆదర్శంగా నిలవడే పనిచేసిండు బెంగుళూరుల ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజలింగప్ప. ఈయన చేసిన పనికూడా ఆషామాషీదేం కాదు… దేశానికి ప్రథమ పౌరుడు… రాష్ట్రపతి కాన్వాయినే ఆపేసిండు. అదే దారిలో ఒక అంబులెన్స్ వస్తున్నది. దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అయితే నిజ లింగప్ప ముందుగాల అంబులెన్స్ ను పంపాడు. ఆ తర్వాతనే రాష్ట్రపతి కాన్వాయ్ కు రయ్యమంటూ సిగ్నల్ ఇచ్చాడు. ఏంటీ ఏకంగా రాష్ర్టపతినే ఆపితే ఎవ్వరూ ఏమీ అనలేదా అంటే ఎందుకన లేదు… మస్తు అన్నరు… వాళ్ల బాస్ ట్వీట్టర్ల ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన కంటే పెద్ద బాస్ షెభాష్ అని మెచ్చుకున్నాడు. అంతేనా… ఆక్కడ్నే ఆగ లేదు… మీరు కూడా ఇట్లా చేయండని సిటీజన్స్ కు పోలీసు బాస్ ఓ రిక్వెస్ట్ కూడా పెట్టిండు…..ఇక నెటిజన్ల అయితే డ్రమ్ముల కొద్ది అభిమానాన్ని నిజలింగప్పపై కురిపించుండే కాదు…. పోలీసు అంటే ఈ ఇంత చేస్తే చాలు అని అంటున్నరు. కార్ల మీద ఎర్రబుగ్గలు పీకేసీ… ఇగో మేము కామన్ మ్యాన్ అంటే సరిపోదు కదా… ఇట్లా చూపించాలి. అయితే తనను ఆపినా ఏమీ అనుకోని రాష్ట్రపతికి కూడా దండాలు పెట్టాల్సిందే మరి. నిజలింగప్ప…. నిజంగ…. మీరు గ్రేటప్పా.