ఒక్కటన్నా దొరకదే.. ఏనుగు ఆట చూడాల్సిందే (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కటన్నా దొరకదే.. ఏనుగు ఆట చూడాల్సిందే (వీడియో)

May 12, 2020

This video of a baby elephant playing with birds is viral. So cute, says Internet

ఆవు దూడలు, గేదె దూడలు, పక్షుల పిల్లలు, కుక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు భలే ముద్దొస్తుంటాయి. వాటి గెంతులు, ఉరుకులు, పరుగులు చాలా తమాషాగా అనిపిస్తుంటాయి. ప్రపంచాన్ని అప్పుడప్పుడే అవి కొత్తగా, వింతగా చూస్తుంటాయి. ప్రపంచాన్ని అవి చూసే దృష్టికోణం వేరేలా ఉంటుంది. ఓ గున్న ఏనుగు పిల్ల తన తల్లి వెనకాల పచ్చిక బయళ్లలో ఉంది. తల్లి ఆహారం కోసం అటూ ఇటూ పచ్చికను చూస్తుంటే ఆ గున్న ఏనుగు మాత్రం అక్కడున్న కొంగలను విచిత్రంగా చూడసాగింది. తెల్లగా ఉన్న అవి దాని కంటికి ఎలా కనిపించాయో గానీ.. వాటిని తరుముతూ సయ్యాటలు ఆడింది. పాపం ఆ కొంగలేమో తమ పొట్ట తిప్పల కోసం ఆ ఎనుగులను చూస్తున్నాయి

వాటి ఒంటిమీద వాలే ఈగలు, గోమార్లను అందుకోవాలని అవి చూస్తుంటాయి. పైగా ఆ ఎనుగులు నడుస్తుంటే వాటి అడుగుల కింద మట్టి లేచినప్పుడు బయటికి వచ్చే పురుగులను కూడా కొంగలు లటుక్కున అందుకుంటాయి. వాటి తిప్పలు తెలియని గున్న ఏనుగుకు వాటితో ఆటలాడే బుద్ధి పుట్టింది. ఒక్కటన్నా దొరకదే అన్న తీరున దాని ఆటలు సాగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను వైల్డ్ లైఫ్ వీడియోలను కంటిన్యూగా షేర్ చేసే IFS ఆఫీసర్ సుశాంత నందా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 14 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. బుల్లి ఏనుగమ్మకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.