అధిక బరువు ఉన్నవాళ్లు పడే వేదన గురించి మాటల్లో వర్ణించలేము. అలాంటి వారు ఈజీగా బరువు ఎలా తగ్గాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఏ వర్కౌట్స్ చేయాలి? అని పదే పదే ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం నిపుణులు పలు కీలక విషయాలను తెలియజేశారు. అధిక బరువు ఉన్నవాళ్లు ఈజీగా బరువు తగ్గే పలు మార్గాలను సూచించారు.
”కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు. కాబట్టి కార్బొహైడ్రేట్లను మితంగా తీసుకోవాలి. అలా అని వాటిని పూర్తిగా మానేయడం మంచిది కాదు. శరీర విధులను నిర్వహించేందుకు నీరు అత్యంత అవసరం. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగితే మంచిది. బరువు తగ్గాలనుకునేవారు.. ఆరోగ్యకరమైన పానీయాలనే తాగాలి. చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ తాగొద్దు. కార్బొనేటెడ్ సోడాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా గ్రీన్ టీ, లెమన్ వాటర్, దోసకాయలు నానబెట్టిన నీళ్లు తాగటం చాలా మంచిది. ఎముకలు, కండర నిర్మాణానికి ఈ పోషకం బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గించే ప్రక్రియలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. కనుక ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇక చివరగా.. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. 15 నిమిషాలు సమయమున్నా, ఆ టైంలో చిన్నచిన్న వర్కౌట్స్ చేసేందుకు ప్రయత్నించాలి. సమయం లేదనే సాకుతో ఎక్సర్సైజ్ను స్కిప్ చేయొద్దు.”