ఈ వైసీపీ ఎమ్మెల్యే..ఊరమాస్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వైసీపీ ఎమ్మెల్యే..ఊరమాస్‌

March 12, 2022

fbfb

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఊరమాస్ స్టెప్పులతో దుమ్మురేపారు. టాలీవుడ్‌లో ‘పలాస 1978’ సినిమా విడుదలై ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది. ఆ సినిమాలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ అనే పాట తెలుగు రాష్ట్రాల్లో తెగ ఫేమస్ అయ్యింది. ఏ ఫంక్షన్ అయినా, ఆ పాట ఉండాల్సిందే డ్యాన్స్ వేయాల్సిందే అనే రేంజ్‌కీ మారిపోయింది. ఈ పాటకు యావత్ యువతే కాదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఊగిపోతున్నారు. పాట వినిపిస్తే చాలు ఆటోమాటిక్‌గా కాళ్లు, చేతులు కదిలిపోతుంటాయి. ఆ రేంజ్‌లో జనాలను ఆకట్టుంది.

అయితే, తాజాగా ఇదే పాటకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ నేత పైమాఘం సుగుణాకర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో.. వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పాల్గొన్నారు. చెన్నైలోని ఒక హోటల్‌లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో డీజే కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో డ్యాన్స్ వేశారు. ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాట వేయగా.. అదిరిపోయే మాస్ స్టెప్పులతో అలరించారు.

పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ దుమ్మురేపారు. కాగా, ఎమ్మెల్యే డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే డ్యాన్స్‌కు ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఫిదా అయిపోతున్నారు. ‘తగ్గేదే లే ఎమ్మెల్యే గారూ..’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.