రుతుపవనాల రాక ఈసారి ఆలస్యమే.. - MicTv.in - Telugu News
mictv telugu

రుతుపవనాల రాక ఈసారి ఆలస్యమే..

May 15, 2019

నైరుతి రుతుపవనాల రాక ఈ ఏడాది కాస్త ఆలస్యం కానుందని భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. సాధారణంగా మన దేశంలోకి ప్రతీ ఏడాది జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, జూలై రెండో వారం వరకు దేశమంతా వ్యాపిస్తాయి. కానీ ఈసారి జూన్ 6వ తేదీన కేరళలోకి ప్రవేశించనున్నాయని స్పష్ట చేసింది. కానీ ఈసారి జూన్ 6వ తేదీన ప్రవేశించనున్నాయి. అంటే ఐదు రోజులు ఆలస్యం కానున్నట్లు ఐఎండీ తెలిపింది.

This Year Monsoon Expected In Kerala On June 6 Likely To Be Below Normal.

‘నైరుతి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యం కానుంది. మే 18-19న అండమాన్, నికోబార్‌ దీవుల మీదుగా రుతుపవనాల రాక మొదలై, నాలుగు రోజులు అటు ఇటుగా జూన్‌ 6న కేరళను తాకి దేశంలోకి ప్రవేశిస్తాయి’ అని ఐఎండీ అంచనా వేసింది. అయితే నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించనున్నాయని ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మంగళవారం తెలిపింది. వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువ నమోదు కానుందని అంచాన వేసింది. వాయువ్య, దక్షిణ భారతదేశ ప్రాంతాలతో పోలిస్తే తూర్పు, ఈశాన్య, మధ్యభారతాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పసిఫిక్‌ సముద్రంపై వేడిగాలుల కారణంగా ఈసారి ‘‘ఎల్‌నినో’’ వచ్చే అవకాశం 55శాతం ఉందని వెల్లడించింది.