బ్రేకింగ్..థామ‌స్ క‌ప్ భారత్‌దే..ఫైన‌ల్లో సాయిరాజ్‌, చిరాగ్ గెలుపు - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్..థామ‌స్ క‌ప్ భారత్‌దే..ఫైన‌ల్లో సాయిరాజ్‌, చిరాగ్ గెలుపు

May 15, 2022

 

థామ‌స్ క‌ప్ చ‌రిత్ర‌లో తొలిసారి ఫైన‌ల్ చేరిన భారత‌ జోడిగా ఇప్ప‌టికే సాయిరాజ్‌, చిరాగ్‌ల జోడీ రికార్డు సృష్టించారు. ఆదివారం ఇండోనేషియాకు చెందిన అసాన్‌, సంజ‌య జోడిపై భార‌త జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఘన విజయం సాధించారు. థామ‌స్ క‌ప్ టోర్నీ డ‌బుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మూడు సెట్లపాటు సాగిన ఈ టైటిల్ వేట‌లో సాత్విక్‌, చిరాగ్ జోడి 18-21, 23-21, 21-19తో గెలిచారు.

మరోపక్క ఇండోనేషియా జ‌ట్టు అప్ప‌టికే 14 టైటిళ్లు గెలిచి, య‌మా స్ట్రాంగ్‌గా ఉంది. సాయిరాజ్‌, చిరాగ్‌ల జోడీ ఇండోనేషియా ఢీకొట్టగలరా? భారత్‌కు థామ‌స్ క‌ప్ తెగలరా? అని అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు. ఇటువంటి సమయంలో నేడు జరిగిన ఫైన‌ల్‌లో ఆ చర్చలను ప‌టాపంచ‌లు చేస్తూ, సాయిరాజ్‌, చిరాగ్ జోడి భార‌త్‌కు థామ‌స్ క‌ప్‌లో తొలి టైటిల్‌ను అందించారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు, ఆటగాళ్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ,సాయిరాజ్‌, చిరాగ్‌ల జోడీని అభినందించారు.