Those Bollywood actors are sleeper cell agents.. Home Minister comments
mictv telugu

ఆ బాలీవుడ్ నటులు స్లీపర్ ‌సెల్ ఏజెంట్లు.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

September 3, 2022

Those Bollywood actors are sleeper cell agents.. Home Minister comments

మహారాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సీనియర్ నటులు షబానా అజ్మీ, జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాలను తుక్డే తుక్డే గ్యాంగ్ స్లీపర్ సెల్స్ ఏజెంట్లుగా అభివర్ణించారు. ఈ నటులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సమస్యలపై మాత్రమే మాట్లాడతారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఘోరాలు జరిగినా నోరు మెదపరంటూ ఆరోపించారు. రాజస్థాన్‌లో కన్హయ్యలాల్ హత్య, జార్ఖండ్‌లో బాలిక సజీవ దహనం వంటి ఘటనల్లో వీరు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగి ఉంటే ఈ అవార్డు వాపసీ గ్యాంగ్ యాక్టివేట్ అయి గొంతు చించుకునేదని విమర్శించారు. కాగా, గుజరాత్‌లో బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని షబానా అజ్మీ వ్యతిరేకించింది. మహిళా సంఘాలు, విద్యార్ధులతో కలిసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన హోం మంత్రి పై విధంగా స్పందించారు.