ఆ బ్రాండ్లు మావి కావు.. బాబువే: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ బ్రాండ్లు మావి కావు.. బాబువే: జగన్

March 23, 2022

jagan

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవలే కల్తీసారా తాగి ఓ 18మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోజు నుంచి నేటీవరకు అసెంబ్లీలో కల్తీసారా, జై బ్రాండ్లపై టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య చర్చ జరుగుతుంది. అంతేకాకుంగా ఈ మద్యం విషయంలో టీడీపీ సభ్యులు జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడుతూ.. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీ దానికి కూడా అనుమతినివ్వలేదు. మొత్తం చంద్రబాబు హయాంలో ఉన్న బ్రాండ్లనే అమ్ముతున్నాం. చంద్రబాబు హయాంలో మొత్తంగా 254 బ్రాండ్లను తీసుకొచ్చారు. ఆ బ్రాండ్ల పేర్లను తెర మీద చూపిస్తున్నాం. చూడండి” అంటూ జగన్ మండిపడ్డారు.

అంతేకాకుండా చంద్రబాబు హయాంలోనే 14 డిస్టిలరీలకు అనుమతులు వచ్చాయని, 2014-19 సంవత్సర మధ్య కాలంలో ఏడు డిస్టిలరీలను అనుమతి ఇచ్చారు అని అన్నారు. నారా బదులు సారా అంటే కరెక్టుగా ఉంటుందోమోనని జగన్ ఎద్దేవా చేశారు. లిక్కర్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని, నేషనల్ స్టాండర్డ్ విధానాలను పాటిస్తూ, లిక్కర్ తయారు చేస్తాయన్నారు. వేల బాటిల్స్‌ను కంపెనీ నుంచి బయటకు ఇచ్చే సమయంలో ఆయా యాజమాన్యాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాయని, ఇదే సమయంలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ టెస్టులు చేయడం జరుగుతుందని జగన్ అన్నారు.

మరోవైపు ఏపీలో రెండవ అధికార భాషగా ఉర్దూను అమోదించారు. ఈ మేరకు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో ఇకనుంచి ఏపీలో రెండో అధికార భాష‌గా ఉర్దూ కొన‌సాగ‌నుంది.