న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. భారీగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందుబాబుల ఆట కట్టించారు అధికారులు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా 31 రాత్రి మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కిన వారిపై కఠినంగా వ్యవహరించారు. వారి లైసెన్సులను రద్దు చేశారు. దీంతో పాటు భారీ జరిమానా(రూ.10 వేల వరకు) విధించారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు హైదరాబాద్ పోలీసులు అనేక చోట్ల నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 5,819 మంది పట్టుబడ్డారు. వీరందరి లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. నార్త్ జోన్ లిమిట్స్‌లో 1103 లైసెన్స్‌లు, సౌత్ జోన్ లిమిట్స్‌లో 1151 లైసెన్స్‌లు, వెస్ట్ జోన్లో 1345 లైసెన్స్‌లు, ఈస్ట్ జోన్లో 510 లైసెన్స్‌లతోపాటు, సెంట్రల్ జోన్లో కూడా పలువురి లైసెన్స్‌లు రద్దు చేశారు. 2021 సంవత్సరంతో 3,220 మంది లైసెన్సులు రద్దయ్యాయి.