those four good qualities of shree rama make you good human being
mictv telugu

శ్రీరాముని ఈ 4 గుణాలు మీలో ఉంటే మీరూ పుణ్యపురుషులౌతారు.

March 28, 2023

those four good qualities of shree rama make you good human being

అధర్మాన్ని జయించి,రావణుడిని సంహరించి, అతని బారి నుండి సీతను రక్షించిన పురుషోత్తముడు శ్రీరాముడు. రాముడు ఎప్పుడూ నీతిని, సత్యాన్ని ఎలా సమర్ధించాడో తెలుసా..? శ్రీరామునిలోని మంచి గుణాలే ఆయనను మర్యాద పురుషోత్తమ పిలిచేలా చేశారు. శ్రీరామా అని సాధారణ పరిభాషలో పిలుస్తారు. ఒక వ్యక్తి శ్రీరాముని యొక్క లక్షణాలను కలిగి ఉంటే విజయపథంలో నడుస్తాడు. మన జీవితంలో శ్రీరాముని గుణాలను అలవర్చుకుంటే సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. శ్రీరామునిలోని ఎలాంటి గుణాలు అలవర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సహనం, ధైర్యం:

సహనం, ధైర్యం ఉన్నవారు జీవితంలో ఏదైనా సాధిస్తారు. శ్రీరాముడు ప్రతి సందిగ్ధంలో ఓర్పుతో సమస్యలను పరిష్కరించాడు. 14 సంవత్సరాల వనవాసాన్ని ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఓపికగా పూర్తి చేసాడు శ్రీరాముడు. ఒక వ్యక్తి శ్రీరామునిలోని ఈ గుణాన్ని పొందినట్లయితే, అతను కూడా విజయపథంలో పయనిస్తాడు.

2. దయతో కూడిన వ్యక్తిత్వం:

శ్రీరాముని స్వభావం ఎప్పుడూ దయతో ఉండేది. సన్యాసి వేషంలో, రాజు హోదాలో అందరిపట్ల సమానమైన దయా భావాన్ని చూపించాడు. సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇవ్వడం, పేద శబరి ప్రసాదించిన పండ్లను ప్రేమతో, గౌరవంతో తినడం శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని దయను తెలియజేస్తుంది.

3. . మంచి స్నేహితుడు:

అయోధ్య రాజుగా 14 ఏళ్ల అజ్ఞాతవాసంలో ఉన్నప్పటికీ, శ్రీరాముడు అక్కడ కలుసుకున్న ప్రతి ఒక్కరికీ మంచి స్నేహితుడిగా ఉన్నాడు. ఈ స్నేహాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. పడవ నడిపే వారిని, సుగ్రీవుడిని, విభీషణుడిని, అందరినీ స్వాగతించాడు.

4.సోదరులపై ప్రేమ:

నేటికాలంలో సోదరులపై ఉన్నవారిని చాలా అరుదుగా చూస్తున్నాం. కానీ 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత కూడా తన తమ్ముళ్లు భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల పట్ల ఆయనకున్న అభిమానం అయోధ్య వదిలి వెళ్లే ముందు కూడా అలాగే ఉంది.

ఈ పైన పేర్కొన్న శ్రీరాముని గుణాలను మన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా మనం మంచి జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. శ్రీరాముని ఈ గుణాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ సన్మార్గంలో పయనించేలా చేస్తాయి.