Those nude photos are not mine...Ranveer Singh
mictv telugu

ఆ న్యూడ్ ఫొటోలు నావి కావు…రణ్‌వీర్ సింగ్

September 15, 2022

బాలీవుడ్ హీరో, నటి దీపికా పదుకొనే భర్త రణవీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫోటోషూట్ చేయడం తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం ఆయన ఈ పని చేయగా, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు రణవీర్‌కు నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరైన రణవీర్.. తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ న్యూడ్ ఫోటోలు తనవి కావని బాంబు పేల్చారు. తన సోషల్ మీడియా ఖాతా నుంచి అసలు పంచుకోలేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్లో దర్శనమిస్తున్న నగ్న ఫోటోలు ఒరిజనల్ కాదని, వాటిని మార్ఫింగ్ చేశారని అన్నారు. తాను దిగిన ఫోటోలకు, బయట ప్రచారంలో ఉన్న ఫోటోలకు తేడా ఉందని వివరించారు. తాను నగ్నంగా ఫోటోలు దిగలేదని వెల్లడించారు.