రాష్ట్రంలో ‘రియల్’ హత్యలకు ఆ ఇద్దరే కారణం : రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రంలో ‘రియల్’ హత్యలకు ఆ ఇద్దరే కారణం : రేవంత్ రెడ్డి

March 2, 2022

trgvf

తెలంగాణలో రియల్ ఎస్టేట్ కేంద్రంగా జరుగుతున్న అనేక హత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ లే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాళ్లిద్దరు కలిసే ధరణి పోర్టల్ ను తెచ్చారనీ, అందులో ఉన్న వివరాలన్నీ తప్పుల తడకగా అభివర్ణించారు. అందులో ఉన్న అనేక లోపాలతో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయనీ, ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. 20 ఏళ్ల క్రితం భూములు అమ్ముకున్న వారి పేర్ల పైనే ఇంకా భూములు ఉన్నట్టు ధరణి యాప్ చూపిస్తోందని, దీని వల్ల భూములు కొనుగోలు చేసిన వారు నష్టపోతూ హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.