గత కొన్ని రోజలుగా సోషల్ మీడియాలో మొసలి లాంటి చేప గురించి కొన్ని ఫోటోలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ముందు నుంచి చూస్తే మొసలి ఆకారంలా కనిపిస్తుంది. వెనక నుంచి చూస్తే చేపలా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఎలిగేటర్ వార్ అని పిలుస్తుంటారు. ఉత్తర అమెరికాలోని మంచినీటిలో పెరిగే ఈ చేపలు మనుషులకు ఎలాంటి కీడు చేయవు కానీ, వీటి గుడ్లు విషపూరితంగా ఉంటాయి. వాటిని తింటే మనషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మనుషులతోపాటు ఏ సముద్ర జీవికూడా వీటి గుడ్లను తినవు. ఇవి దాదాపు 10 అడుగుల పొడవు, 160 కేజీల వరకు బరువు పెరగగలవు. ఇలాంటి వింత చేపల ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.