స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలి - MicTv.in - Telugu News
mictv telugu

స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలి

April 4, 2020

Those who go to Delhi must voluntarily come and take the corona tests.. CM KCR

కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ఢిల్లీ నుంచి వచ్చిన మర్కజ్ యాత్రికులు నిరాకరిస్తుండటంతో ముుఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్‌లోకి వెళ్లాలని అన్నారు. వారిని ఒప్పించే బాధ్యతను మతపెద్దలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కేసీఆర్ మతపెద్దలతో ఫోన్‌లో మాట్లాడి.. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని చెప్పారు.

రోజుకు మూడు షిఫ్ట్‌లు పనిచేసి మర్కజ్ యాత్రికుల్లో ఎవరు కరోనా పాజిటివ్, ఎవరు నెగెటివ్ అనేది తేల్చాలని అధికారులు భావిస్తున్నారు. 85 శాతం కొత్త కేసులు ఢిల్లీ మర్కజ్‌తో బంధమున్నవే కావడంతో తెలంగాణ అధికార వర్గాలు మరింత అప్రమత్త చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మర్కజ్ యాత్రికుల కోసం 6 కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, దేశంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంతో ముడిపడినవే ఉండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగిన విషయం తెలిసిందే.