Those who received a booster dose should not receive the nasal vaccine
mictv telugu

అలర్ట్.. బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ వేసుకోవద్దు

December 28, 2022

Those who received a booster dose should not receive the nasal vaccine

కరోనా వైరస్ అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే మూడు డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ ఇచ్చింది. ఈ మూడో డోస్ తీసుకున్న వారు కొత్తగా వచ్చిన నాసల్ వ్యాక్సిన్ (ముక్కుద్వారా ఇచ్చేది) తీసుకోవద్దని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మెన్, దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎన్ కే అరోరా హెచ్చరించారు. బూస్టర్ డోస్ తీసుకోని వారు మాత్రమే నాసల్ డోసు తీసుకోవాలని సూచించారు. కాదని నాసల్ డోస్ తీసుకుంటే ఆ వ్యక్తి శరీరం స్పందించడ ఆగిపోవచ్చని, ఒకవేళ స్పందించినా స్పందన చాలా తక్కువగా ఉంటుందన్నారు. అందుకే తొలి రెండు డోసుల మధ్య గ్యాప్ ని ఆరు నెలలు విధించామని, తర్వాత మూడో డోసుకి మూడు నెలలు వ్యవధి ఉంచామన్నారు.

దీని వల్ల అనుకున్న ఫలితం రాలేదని అందుకే నాలుగో డోసుగా నాసల్ డోస్ వద్దని చెప్తున్నామన్నారు. బూస్టర్ డోస్ తీసుకోని వారికి మాత్రమే నాసల్ టీకాను రెకమెండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక మరో ప్రకటనలో చైనాలో కోవిడ్ వ్యాప్తికి నాలుగు వేరియంట్లు కారణమని వెల్లడించారు. బీఎఫ్ 7 వేరియంట్ కేసులు 15 శాతం మాత్రమే నమోదవుతున్నాయని, మిగతా వాటిలో అత్యధికంగా 50 శాతం కేసులు బీఎన్, బీక్యూ వేరియంట్ల ద్వారా వ్యాపిస్తోందన్నారు. అలాగే ఎస్వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కేసులు వస్తున్నాయని, దీంతో రోగులకు భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వల్ల భారతీయులకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ లభించిందని, అందువల్ల మనవాళ్లు భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. కరోనా కేసుల విషయంలో చైనా సమాచారాన్ని దాస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.