ఆ డబ్బులు మోదీనే వేస్తున్నాడనుకున్నా.. నాకేం తెలీదు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ డబ్బులు మోదీనే వేస్తున్నాడనుకున్నా.. నాకేం తెలీదు.. 

November 22, 2019

Thought Modi-ji Was Giving Money Curious Case Of 2 Men, One SBI Account

తన అకౌంట్‌లో నెలనెలా వచ్చి పడుతున్న డబ్బులను  మన ప్రధాని మోదీయే వేస్తున్నారని భ్రమించిన ఓ వ్యక్తి శుభ్రంగా వాటిని ఖర్చు చేసుకోసాగాడు. విదేశాల నుంచి బ్లాక్‌ మనీని రప్పించి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానని చెప్పిన మోదీ తన మాట నిలబెట్టుకున్నారని ఆ అమాయకుడు అనుకున్నాడు. వేరొకరి ఖాతాలో పడాల్సిన డబ్బులు  బ్యాంకు అధికారుల నిర్వాకం వల్ల తన ఖాతాలో డబ్బులు పడుతున్నాయని తెలిసి ఉసూరుమన్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 

బింద్‌ జిల్లా రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్‌ ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కష్టార్జితాన్ని స్టేట్‌ బ్యాంక్‌  ఆఫ్‌ ఇండియాలో జమ చేసుకుంటున్నాడు.  ఖాతాలో రూ. 140,000 నమోదయ్యాయి. తను జమచేసిన దానికంటే ఎక్కువ ఉండంతో మోదీ వేశాడేమోని అనుకున్నాడట. పనిపై ఊరికి వచ్చిన హుకుం సింగ్ డబ్బులు విత్ డ్రా చేద్దామని ప్రయత్నించగా అకౌంట్‌లో కేవలం రూ. 35,400 మాత్రే కనిపించాయి. ఎవరైనా తన అకౌంట్‌ను హ్యాక్ చేశారేమోనని భావించి వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేశాడు. 

బ్యాంకు అధికారులు విచారించగా.. ఒకే అకౌంట్‌ నెంబర్‌పై రెండు అకౌంట్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో హుకుం సింగ్‌(రురై గ్రామం).. హుకుం సింగ్‌ (రోనీ గ్రామం) అని ఉన్నాయి. ఇద్దరూ ఒకే బ్రాంచ్‌ ఆలంపూర్‌లో అకౌంట్‌ తీయడంతోపాటు ఇద్దరి పేర్లు కుడా ఒకటే అవ్వడంతో బ్యాంకు మేనేజర్‌ కంగారుపడ్డారు. ఇద్దరికి ఒకే అకౌంట్‌ నెంబర్‌ కేటాయించారు. డబ్బులు తీసుకున్న హుకుంసింగ్‌ను బ్యాంకు అధికారులు పిలిచి విచారించగా.. ఆరు నెలల్లో దాదాపు రూ.89,000 వేలు విత్‌డ్రా చేశానని అధికారుల ముందు ఒప్పుకున్నాడు. ఆరు నెలల్లో దాదాపు రూ.89,000 వేలు విత్‌డ్రా చేశానని అధికారుల ముందు ఒప్పుకున్నాడు. 

ఎన్నికల సమయంలో నల్లధనాన్నివెనక్కి తీసుకువచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తానని అప్పట్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ప్రస్తుతం తమ అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నారని అనుకున్నానని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు.  చివరికి అసలు విషయం తెలుసుకున్న హుకుం సింగ్‌ నిరాశపడ్డాడు.