లాక్ డౌన్ ప్రచారం..5రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం మటాష్ - MicTv.in - Telugu News
mictv telugu

లాక్ డౌన్ ప్రచారం..5రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం మటాష్

July 5, 2020

vmhvbm

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి సగటున 1500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసి పరిధిలో రోజుకి సగటున వెయ్యి చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జులై 1 నుంచి హైదరాబాద్ లో మళ్ళీ కఠినంగా లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెల్సిందే. సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో హైదరాబాద్ లో నివసించే ఎందరో ప్రజలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. 

అలాగే నగరంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. జూన్‌ 26 నుంచి 30 మధ్య రూ.973.61 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఒకవేళ జులై 1నుండి లాక్ డౌన్ అమలు చేస్తే ఇక మద్యం దొరకదని భావించిన మద్యప్రియులు ముందే కొనుక్కుని నిల్వ చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల రాబడి సమకూరడం గమనార్హం.