హైదరాబాద్‌లో  2,200 మంది కరోనా పేషంట్ల గల్లంతు  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో  2,200 మంది కరోనా పేషంట్ల గల్లంతు 

July 16, 2020

Thousands of Corona patients missing in hyderabad

ఒక్క కరోనా పేషంట్ కనిపించకుండా పోతేనే వీధులు, ఊళ్లు గగ్గోలు పెడుతుంటాయి. అలాంటిది హైదరాబాద్ మహా నగరంలో ఏకంగా 2,200 మంది పేషెంట్లు కనిపించకుండా పోయారు. రెండు వారాలుగా వీరు ఆచూకీ తెలియడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

వారు తమ చిరునామాలను, ఫోన్ నంబర్లను తప్పుగా ఇచ్చారని వాపోయింది. హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిన ఆ రోగులకు హోం ఐసొలేషన్ కిట్లను ఇవ్వడానికి  ప్రయత్నించగా ఈ విషయం తెలిసిందని పేర్కొంది. కొందరు ఇల్లు ఖాళీ చేశారని, కొందరు వేరే ప్రాంతాలకు వెళ్లారని అధికారులు చెబుతున్నారు. వారి నంబర్లకు ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఎక్కడున్నా ఐసొలేషన్ లే ఉండాలని, బయటి తిరిగితే వైరస్ మరింత మందికి వ్యాపిస్తుందని సూచిస్తున్నారు. నగరంలో గత 13 రోజుల్లోనే 15 వేల కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 33 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.