ప్రకృతిని అర్ధం చేసుకోవడంలో మనుషుల కంటే పక్షులు, జంతువులు ఇతర జీవ జాతులు ముందుంటాయనే ఒక అభిప్రాయం ఉంది. సునామీ, భూకంపాల వంటి ప్రమాదాలను అవి ముందుగా గుర్తించి తమను తాము కాపాడుకుంటాయని ఓ వర్గం ప్రజలు నమ్ముతారు. కుక్కలు, కోళ్లు, ఆవులు వంటి జంతువులు ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరళివెళ్తాయని గ్రామాల్లో సైతం చర్చ జరుగుతూంటుంది. ఇటీవల తుర్కియే, సిరియాలలో వచ్చిన భారీ భూకంపాలకు కొద్ది క్షణాలకు ముందు పక్షులు అసాధారణంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. భారీ సంఖ్యలో ఆకాశంలో అరుస్తూ సంచరిస్తూ కనిపించాయి.
ఇప్పుడు ఇదే సీన్ జపాన్‌లో ఆవిషృతమైంది. క్యోటో నగరంలోని హోన్షులో వేలాది కాకులు ఒకేచోట గుమిగూడాయి. అనంతరం ఆకాశం మీదుగా ఎగురుతున్న కాకుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోన్షు ద్వీపంలోని వీధుల్లో సంచరిస్తున్న కాకులు అసాధారణ ప్రవర్తన కలిగి ఉన్నాయని తెలుస్తోంది. దీంతో జపాన్ ప్రజలు.. సునామీ లేదా భూకంపం ఖాయం అంటూ ఆందోళన చెందుతున్నారు. అలాగే ముందస్తుగా సురక్షిత ప్రాంతాల కోసం వెతుకుతున్నట్టు సమాచారం.
వీడియో చూసిన వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మనిషి ఆధునికత పేరుతో ప్రకృతి నుంచి దూరంగా జరిగినా.. ప్రకృతితో సహజీవనం చేసే జంతుజాలానికి ప్రమాదాలను ముందస్తుగా పసిగట్టే శక్తి ఉంటుందని దీన్ని బట్టి జపాన్ దేశంలో త్వరలో ఏదో ఘోరం జరుగబోతోందని విశ్లేషిస్తున్నారు. కాగా, 2004లో సునామీ రాకతో జపాన్ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.
何か怖いな〜😰😰 pic.twitter.com/TVlylSgMeg
— マッチヤン (@QrmhPb4rtA6JxTH) February 8, 2023