ఏమి సేతురా లింగా...ప్రత్యేక మతం కావాలట..! - MicTv.in - Telugu News
mictv telugu

ఏమి సేతురా లింగా…ప్రత్యేక మతం కావాలట..!

July 21, 2017

కర్ణాటకలో లింగాయతులు ఒక్కటయ్యారు.హిందూ మతం నుంచి తమను విడదీయాలని కోరుతున్నారు. అంతే కాదు తమను ప్రత్యేకంగా మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.లింగాయత్ లను ఇండిపెండెంట్ రీలిజియన్ గా గుర్తించాలని సీఎం సిద్ధరామయ్యకు వినతిపత్రం ఇచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.

కర్ణాటక రాష్ట్రంలో 60లక్షల మంది లింగాయతులు ఉన్నారు.ప్రస్తుతం బీసీలు గా ఉన్న వీరశైవ బనజిగ,వీరశైవ ఆరాధ్య, వీరశైవ రెడ్డి, వీరశైవ సదర,వీరశైవ పంచమశాలిలు లింగాయతుల్లో విభాగాలు.వీరు లింగా దేవుడు, అంటే శివుడ్ని ఒక్కడినే పూజిస్తారు. అందుకే తమకు హిందుమతంతో సంబంధం లేదంటున్నారు ఎప్పటి నుంచో.

33 కోట్లు మంది హిందూ దేవుళ్లు, దేవతలు ఉన్నారు..హిందువులు వారందరినీ పూజిస్తారన్నారు.తమకు ఒక్క లింగాయే దేవుడు అని..అందుకే స్వతంత్ర ప్రతిపత్తి గల మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటకలోని బీదర్ లో పెద్దయెత్తున సమావేశాన్ని, ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో లింగాయత్ మఠాల స్వాములు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక మతంగా గుర్తించాల్సిందేనంటూ కోరారు. 2011 జనాభా లెక్కలప్పుడు రీలిజియన్ కాలమ్ న్ని అదర్స్ కింద నింపారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పలు రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.