బెంగళూరులో టెన్షన్.. 6 వేల మంది కరోనా పేషంట్లు పరార్ - MicTv.in - Telugu News
mictv telugu

బెంగళూరులో టెన్షన్.. 6 వేల మంది కరోనా పేషంట్లు పరార్

May 10, 2021

01...

కరోనా వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, సోకిన తర్వాత అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కొందరి అవాగాహన లేమి వల్ల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కరోనా రోగులు జనం మధ్యకు వచ్చి పడుతున్నారు. సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఏకంగా 6 వేల మంది కరోనా పేషంట్లు ఆస్పత్రులను నుంచి పారిపోయారు.

01...

కరోనా పేషంట్లు, కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన వారి వివరాలు సేకరించిన ప్రభుత్వం మొత్తం 6 వేల మంది ఆచూకీ తెలియడం లేదని వాపోతోంది. తప్పుడు అడ్రసులు, ఫోన్ నంబర్లు ఇచ్చారని, వారికి సమాచారం చేరవేస్తే స్పందన లేదని చెప్పుకొస్తోంది. బెంగళూరులో గతంలోనే వేలమంది కరోనా పేషంట్లు ఐసొలేషన్‌లో ఉండకుండా ఆఫీసులకు, పనులు వెళ్లారు. పేదరికం, ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క పరిస్థితి భయానకంగా ఉండడంతో కరోనా పేషంట్లు మీడియాలో చెప్పే మందులు వాడుతూ సొంత చికిత్స చేసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.