వేల సంఖ్యలో తేళ్లు.. ధైర్యముంటే చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

వేల సంఖ్యలో తేళ్లు.. ధైర్యముంటే చూడండి

May 14, 2022

సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ వీడియోను చూస్తే బాబోయ్.. ఇన్ని తేళ్లా.. అని అనక మానరు. ఎక్కడ? ఏ ప్రాంతమో తెలియదు కానీ వాడకంలో లేని ఓ ఇంటిలో వందలాది తేళ్లు బయటపడ్డాయి. పరిమాణంలో చిన్నవైన విషపూరితమైన ఆ తేళ్లు అన్నీ… గదుల్లోని నేల మీద, గోడల మీద పాకుతూ ఉన్న దృశ్యాలు ఒళ్లు గగుర్పాటకు గురి చేస్తున్నాయి. అందుకు సంబంధించిన క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.

దీన్ని చూసిన నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మేలేమంటూ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆ తేళ్లన్నీ విషపూరితమైనవని, వాటి విషం కోసం మాత్రమే వాటిని పెంచుతూ ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వాటిని మందులు(మెడిసిన్‌లు) తయారు చేసేందుకు ఉపయోగిస్తూ ఉండవచ్చని అంటున్నారు. నెటిజన్లు అంతా ఈ వీడియోని చూడాలంటే ధైర్యం ఉండాలనంటున్నారు.